ETV Bharat / sitara

రామ్​ చరణ్- శంకర్​ చిత్రం షూటింగ్​పై క్లారిటీ..

author img

By

Published : Jul 22, 2021, 4:59 PM IST

రామ్ చరణ్​-శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్​పై స్పష్టతనిచ్చారు నిర్మాత దిల్​రాజు. సెప్టెంబర్​లో షూటింగ్​ ప్రారంభమవుతుందని తెలిపారు.

charan shankar
చరణ్ శంకర్

మెగా పవర్​స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇప్పటికే అధికారిక ప్రకటన రాగా.. తాజాగా షూటింగ్​ ప్రారంభంపై స్పష్టతనిచ్చారు నిర్మాత దిల్​రాజు. సెప్టెంబర్​లో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభిస్తామని తెలిపారు. ఇటీవలే ఈ సినిమా సంగీత దర్శకుడిగా తమన్, కొరియోగ్రాఫర్​గా జానీ మాస్టర్, మాటల రచయితగా సాయి మాధవ్​ బుర్రాను ఎంపిక చేసింది చిత్రబృందం. హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది.

మలయాళ సూపర్​స్టార్ మమ్ముట్టి హీరోగా నటిస్తున్న చిత్రం 'బ్రో డాడీ'. మరో కథానాయకుడు పృథ్వీరాజ్ దర్శకత్వం వహించడం సహా ఇందులో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్​లో ఇటీవలే ప్రారంభమైంది. తాజాగా ఈ మూవీ షూటింగ్​లో పాల్గొంది సీనియర్ నటి మీనా. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేసింది.

నటి పూజా హెగ్డే కరోనా వ్యాక్సిన్ వేయించుకుంది. ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో టీకా తీసుకుంది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేసింది. "నవ్వుతో భయాన్ని దాచుకునే సందర్భం ఇదే" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

Pooja Hegde
పూజా హెగ్డే

ఇవీచూడండి: MAA Elections: అలా చేస్తే పోటీ నుంచి తప్పుకుంటా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.