మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కోసం ఆయన అభిమానులు దాదాపు 231 కిలోమీటర్లు నడిచి హైదరాబాద్ వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న చరణ్ వారిని కలిసి తన మంచితనాన్ని చాటుకున్నారు. వారితో చాలా విషయాలు మాట్లాడారు. తాజాగా ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
చరణ్ అంటే ఇష్టంతో ఆయన అభిమానులు సంధ్యా రాజ్, రవి, వీరేశ్ హైదరాబాద్‌కు వచ్చారు. జోగులాంబ గద్వాల నుంచి దాదాపు 231 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి వీరు చరణ్ ఇంటికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మెగా పవర్‌స్టార్ వారితో సరదాగా కాసేపు ముచ్చటించి ఫొటోలకు పోజిచ్చారు.
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌కు మొదటి సినిమా నుంచి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా వెండితెర అరంగేట్రం చేసినా.. మొదటి చిత్రం 'చిరుత'తోనే తానేంటో నిరూపించుకున్నారు. ప్రస్తుతం నటుడిగానే కాక నిర్మాతగానూ మారి సక్సెస్ సాధించారు.