మనం ఏం చేసినా అది మనకు ఆనందాన్నిచ్చేదిగా ఉండాలంటోంది నటి రకుల్‌ప్రీత్ సింగ్. ప్రస్తుతం నాగార్జునతో కలిసి ‘మన్మథుడు2’ చిత్రంలో నటిస్తుంది. షూటింగ్ స్విట్జర్లాండ్‌లో జరుగుతోంది. చిత్రీకరణలో పాల్గొంటూనే తనకిష్టమైన ప్రదేశాలను చుట్టొస్తుంది. ఇటీవల లండన్‌లో జరిగిన భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌కు హాజరై సందడి చేసింది.
‘మన్మథుడు2’ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. వెన్నెల కిశోర్, రావు రమేశ్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. బాలీవుడ్‌లో ఈ మధ్యే ‘దే దే ప్యార్ దే’ సినిమాతో సందడి చేసిందీ భామ. మరోవైపు ‘మర్జావాన్’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో రితేశ్ దేశ్‌ముఖ్, సిద్ధార్థ్ మల్హోత్రా, తారా సుతారియా ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.
ఇది చదవండి: పోర్చుగల్‌లో మన్మథుడి కోసం రకుల్ వేట