జీవితంలో ప్రేమ, పెళ్లిలో ఉండే మాధుర్యాన్ని తాను బలంగా నమ్ముతానంటోంది స్టార్ హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్. కానీ ప్రజలు ఈ బంధాన్ని ఓ భారంగా ఎందుకు భావిస్తారో తనకు అర్థంకావట్లేదని తెలిపింది.
"జీవితంలో ఓ వ్యక్తిగా ఎలా వ్యవహరించాలి, ఎలా ఉండకూడదో తెలుసుకున్నా. తల్లిదండ్రుల వల్ల ప్రేమకు నిర్వచనం అర్థమైంది. జీవితంలో ఈ ప్రేమ, పెళ్లి బంధం అనేది ఎంతో మధురమైంది. ఈ విషయాన్ని సమర్థిస్తా. కానీ ప్రజలెందుకు దీన్ని ఓ భారంగా భావిస్తున్నారో అర్థం చేసుకోలేకపోతున్నా. నేను మాత్రం ఎదుటివారికి ఎంతో స్వచ్ఛమైన ప్రేమను అందిస్తా."
-రకుల్ ప్రీతి సింగ్.
తనకెలాంటి జీవిత భాగస్వామి కావాలో కూడా చెప్పుకొచ్చింది రకుల్. మంచి వ్యక్తిత్వం, ఎత్తు, ముఖ్యంగా తెలివితేటలు ఉండాలని తెలిపింది. జీవితంలో అతడికంటూ కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుని వాటికోసం కృషి చేయాలని చెప్పింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
జీవితంలో వీటికే నా ప్రాధాన్యం
చదువుకునే రోజుల నుంచే నటనపై అమితంగా ఇష్టం పెంచుకున్నట్లు తెలిపిన రకుల్.. పద్దెనిమిదేళ్ల వయస్సులో మోడలింగ్‌లో ప్రవేశించినట్లు వెల్లడించింది. తన తొలి ప్రాముఖ్యత ఇదేనని చెప్పుకొచ్చింది.
"చిన్నప్పటి నుంచే నటి అవ్వాలని కలలు కన్నా. పాకెట్ మనీ కోసం కన్నడలో నా తొలి సినిమా చేశా. జీవితంలో ఈ మూడు 'ఎఫ్'లు (ఫిల్మ్, ఫుడ్, ఫిట్నెస్)లకు ప్రాధాన్యం ఇస్తా."
-రకుల్ ప్రీత్ సింగ్.
ప్రస్తుతం బాలీవుడ్లో రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతోన్న చిత్రంలో అర్జున్ కపూర్ సరసన నటిస్తోంది రకుల్. దీంతోపాటు కమల్‌హాసన్ 'భారతీయుడు 2'లోనూ కనిపించనుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇది చూడండి : బాలీవుడ్లో బంధుప్రీతి లేదు: జేమీ