ETV Bharat / sports

రోహిత్ - కోహ్లీని మరిపిస్తున్న శాంసన్-తిలక్! - ఇద్దరూ ఇద్దరే - SANJU TILAK

రికార్డ్​లను బ్రేక్ చేస్తున్న శాంసన్, తిలక్ - ఒకప్పుడు రోహిత్‌-కోహ్లీలా ఇప్పుడు శాంసన్‌-తిలక్‌

Sanju Tilak Partnership
Sanju Tilak Partnership (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 17, 2024, 10:36 AM IST

Sanju Tilak Partnership : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీమ్​ఇండియాకు మూల స్తంభాలు. దశాబ్దానికి పైగా భారత జట్టులో కీలక ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌తో ఈ ఇద్దరు పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పారు. దీంతో ఓపెనర్‌గా హిట్‌మ్యాన్‌ బాదుడును భర్తీ చేసే ఆటగాడు ఎవరు వస్తారు? మూడో స్థానంలో పరుగుల రారాజుగా ఎవరు ఉంటారనే అనే ప్రశ్నలు వచ్చాయి. అయితే వీటికి సమాధానంగా సంజు శాంసన్, తిలక్‌ వర్మ పేర్లు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు రోహిత్‌-కోహ్లీలా ఇప్పుడు శాంసన్‌-తిలక్‌ ఒకరిని మించి మరొకరు అదరగొడుతున్నారు.

రోహిత్​లా అదరగొడతున్న శాంసన్
2015లోనే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసినప్పటికీ శాంసన్‌ ఇప్పటివరకూ 37 టీ20లు, 16 వన్డేలు మాత్రమే ఆడాడు. తొమ్మిదేళ్ల కెరీర్‌లో అతను తక్కువగా మ్యాచ్‌లు ఆడేందుకు ప్రధానంగా రెండు కారణాలున్నాయి. ఒకటేమో అవకాశాలు రాకపోవడం, ఇంకోటి వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోలేకపోవడం. సంజు అంటే ప్రతిభావంతుడైన బ్యాటర్‌ అని అందరూ చెప్తారు. కానీ అరంగేట్రం దగ్గరి నుంచి ఈ ఏడాది బంగ్లాదేశ్‌తో సిరీస్‌ ముందు వరకూ 30 టీ20 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌ ఆర్డర్లో టాప్‌-7 స్థానాల్లో తిరగడమే అతని పనిగా మారింది. బ్యాటింగ్‌ లైనప్‌లో తనకంటూ ఓ శాశ్వత స్థానం లేకుండా పోయింది. 2015లో తొలి టీ20 ఆడిన శాంసన్‌ ఆ తర్వాత రెండో మ్యాచ్‌ ఆడేందుకు అయిదేళ్లు పట్టింది. ఇక దేశవాళీల్లో, ఐపీఎల్‌లో రాణించినా తీవ్రమైన పోటీ కారణంగా జాతీయ జట్టులో మళ్లీ అడుగుపేట్టలేదు. అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకోలేదు. అలాంటి సమయంలోనే ఈ ఏడాది బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు జైస్వాల్, గిల్‌కు విశ్రాంతినివ్వడం వల్ల ఓపెనర్‌గా ఆడే సువర్ణావకాశం శాంసన్‌కు వచ్చింది. 2013లో రోహిత్‌లా 2024లో శాంసన్‌ ఓపెనర్‌గా అదరగొడుతున్నాడు.

తొలి ఆటగాడిగా రికార్డ్
2013 ఛాంపియన్స్‌ ట్రోఫీతో ఓపెనర్‌గా కెరీర్‌ మళ్లీ ప్రారంభించిన రోహిత్‌ జట్టులో పాతుకుపోయాడు. ఇప్పుడు రోహిత్‌ లాగే శాంసన్‌ సాగుతున్నాడు. అయిదు మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలు చేశాడు. టీ20ల్లో వరుసగా రెండు సెంచరీలు చేసిన తొలి భారత బ్యాటర్‌గా, ఒకే ఏడాదిలో మూడు టీ20 శతకాలు అందుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు. శాంసన్‌ అంటే గుర్తుకొచ్చేది పవర్‌హిట్టింగ్‌. ఎక్కువగా కదలకుండానే భుజ బలాన్ని ఉపయోగించి అలవోకగా బంతిని స్టాండ్స్‌లో పడేస్తాడు. స్పిన్నర్ల బౌలింగ్‌లో అతను క్రీజును ఉపయోగించుకునే తీరు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గుడ్‌లెంగ్త్‌ బంతులకు క్రీజులో లోపలికి జరిగి ఆన్‌సైడ్‌ అమాంతం ఎత్తి పడేస్తాడు. అదే ఫ్లయిటెడ్‌ డెలివరీ రాగానే ముందుకు దూసుకొచ్చి బౌండరీ బయటకు పంపిస్తాడు. ఇక ఫుల్‌షాట్‌తో డీప్‌మిడ్‌వికెట్‌లో పరుగులు రాబట్టడం అతనికి మహా సరదా. అతను బ్యాటింగ్‌ను ఎంతో సులువుగా మార్చేస్తాడు. ఇంత అలవోకగా సిక్సర్లు కొట్టొచ్చా అనిపిస్తాడు. కచ్చితమైన టైమింగ్‌తో ఆడి, మంచినీళ్లు తాగినట్లు శతకాలు కొడుతున్నాడు. కానీ నిలకడ కొనసాగించాల్సిన అవసరం ఉంది. అయితే సెంచరీ లేదా డకౌట్‌ అనేలా ఆడుతున్నాడు. అతను నిలకడ అందుకుంటే ఓపెనర్‌గా స్థిరపడ్డట్లే.

కోహ్లి రికార్డ్ బ్రేక్ చేసిన తిలక్
చిన్న వయసులోనే ఒడుదొడుకులు ఎదుర్కొని ఉరకలెత్తే యువరక్తంతో అడ్డంకులు అధిగమిస్తూ దూసుకెళ్తున్నాడు హైదరాబాద్‌ కుర్రాడు తిలక్‌ వర్మ. 22 ఏళ్ల ఈ ఆటగాడు ఇప్పుడు భారత క్రికెట్లో సంచలనంగా మారాడు. ఐపీఎల్, దేశవాళీల్లో అదరగొట్టి గతేడాది అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అతను మధ్యలో నిలకడలేమి, గాయాలతో జట్టుకు దూరమయ్యాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ తర్వాత గాయాలతో శ్రీలంక, జింబాబ్వే సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. బంగ్లాతో సిరీస్‌లో కూడా అవకాశం రాలేదు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన అతను తొలి రెండు మ్యాచ్‌ల్లో 33, 20 పరుగులే చేశాడు. అప్పటివరకూ నాలుగు లేదా అయిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్‌, కెప్టెన్‌ సూర్యకుమార్‌ను అడిగి మరీ దక్షిణాఫ్రికాతో మూడో టీ20లో మూడో స్థానంలో దిగాడు. అంతే ఒక్కసారిగా సీన్ అంతా మారిపోయింది. వరుసగా రెండు సెంచరీలతో తన సత్తాను చాటాడు. బ్యాటింగ్‌ ఆర్డర్లో మూడో స్థానంలో కోహ్లీని భర్తీ చేసేలా సాగుతున్నాడు. తాజాగా ఓ టీ20 ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా కోహ్లి (ఇంగ్లాండ్‌తో 5 మ్యాచ్‌ల్లో 231) రికార్డును తిలక్‌ (4 మ్యాచ్‌ల్లో 280) బద్దలు కొట్టాడు. వరుసగా రెండు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డులతో పాటు 'మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌'నూ దక్కించుకున్నాడు.

ఈ తరం కుర్రాళ్లు బంతిని బలంగా బాదడంపై దృష్టి పెట్టి వికెట్‌ సమర్పించుకునే ప్రమాదంలో పడుతున్నారు. కానీ తిలక్‌ మాత్రం సంప్రదాయ ఆటతీరుతో పాటు వినూత్న షాట్లతోనూ అలరిస్తున్నాడు. ఓ మోకాలిని నేలకు తాకించి అతను కొడుతున్న సిక్సర్ల అందం చూస్తుంటే తనివితీరదు. ఇక రివర్స్‌ స్వీప్‌తోనూ సిక్సర్లు, ఫోర్లు అలవోకగా రాబడుతున్నాడు. క్రీజులో 360 డిగ్రీల వైపు షాట్లు కొడుతున్నాడు. ఎడమ చేతి వాటం స్పిన్నర్ల బౌలింగ్‌లో గతంలో తడబడటం వల్ల కేశవ్‌ మహరాజ్‌తో తిలక్‌కు కళ్లెం వేయాలని మార్‌క్రమ్‌ అనుకున్నాడు. కానీ చివరి టీ20లో తిలక్‌ ఓ ఆటాడుకున్నాడు. సిక్సర్లు కురిపించాడు. అలాగే వికెట్‌కు దూరంగా బంతులు వేసి పేసర్లకు, క్రీజుకు అడ్డంగా జరిగి స్వీప్‌తో స్క్వేర్‌లెగ్‌ బౌండరీలతో బదులిస్తున్నాడు. ఎప్పటికప్పుడు ఆటను మార్చుకుంటూ తిలక్‌ పురోగతి సాధిస్తున్నాడనేందుకు ఇదే నిదర్శనం. ఆఫ్‌స్పిన్‌ వేయగల సామర్థ్యం కూడా తిలక్‌లో ఉంది. అందుకే నిఖార్సైన ఆల్‌రౌండర్‌గా ఎదగాలని, మూడు ఫార్మాట్లలోనూ ఆడాలనే లక్ష్యంతో సాగుతున్నాడు. తిలక్‌ ఇప్పటివరకు 20 టీ20లు, 4 వన్డేలు ఆడాడు. టీ20ల్లో అతని సగటు 51.33 కావడం విశేషం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.