ETV Bharat / state

'ఆల్​ ఇన్​ వన్ రామ్' సలహాలు వింటున్నారా - అయితే మీ ఆరోగ్యం ఒకసారి చెక్​ చేసుకోండి! - TMC CRACKS FAKE DOCTOR IN INSTAGRAM

నకిలీ డాక్టర్​ను పట్టుకున్న తెలంగాణ వైద్యమండలి - సోషల్​ మీడియాలో శాస్త్రీయత లేని సలహాలు ఇస్తున్న ఫేక్​ డాక్టర్​

Telangana Medical Council Caught Fake Doctor on Instagram
Telangana Medical Council Caught Fake Doctor on Instagram (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 17, 2024, 11:14 AM IST

Updated : Nov 17, 2024, 11:32 AM IST

Telangana Medical Council Caught Fake Doctor on Instagram : ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్లాట్​ఫామ్స్​లో డాక్టర్లు వీడియోలు చేస్తూ ఆరోగ్య అలవాట్లు, పలు విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. అలాంటి వారికి ఫాలోవర్స్ ఎక్కువే. ప్రజలు కూడా వారు నిజం డాక్టర్ల లేదా అన్న విషయం పక్కన పెట్టి చెప్పిందల్లా నమ్మేస్తుంటారు. దాన్నే ఆసరాగా తీసుకున్న ఓ వ్యక్తి డాక్టర్ అవతారం ఎత్తాడు. సామాజిక మాధ్యమాల్లో ప్రజల నాడి పట్టేసి, వ్యూస్, లైక్​ల కోసం 'ఆల్​ ఇన్ వన్​ రామ్'​ పేరుతో అన్ని జబ్బులకు శాస్త్రీయత లేని సలహాలు ఇస్తున్నాడు. ఇతని సలహాలు పాటించిన కొంతమంది తీవ్ర అస్వస్థతకు గురైన సందర్భాలు ఉన్నాయి.

హైదరాబాద్​లో స్ట్రీట్​కో శంకర్​దాదా ఎంబీబీఎస్ - ఈ ఫేక్ డాక్టర్లతో జాగ్రత్త సుమీ!! - FAKE DOCTORS IN HYDERABAD

వేములవలస రాంబాబు అనే నకిలీ వైద్యుడిని తెలంగాణ వైద్య మండలి వైస్​ ఛైర్మన్ డాక్టర్​ శ్రీనివాస్, డాక్టర్​ ఇమ్రాన్​లు పట్టుకున్నారు. మూడు నెలలుగా ఇతడి తీరును పరిశీలించిన వారు హైదరాబాద్​లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో పట్టుకున్నారు. రాంబాబు ఇన్​స్టాగ్రామ్​ లాంటి సోషల్​ మీడియా ద్వారా ప్రజలను మోసం చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ నకిలీ డాక్టర్​పై ఎన్​ఎంసీ చట్టం 34, 54 కింద ఫిర్యాదు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. సోషల్​ మీడియాలో ఇలాంటి వారి సలహాలు, సూచనలు పాటించవద్దని సూచించారు.

మత్తు ఇంజక్షన్ల 'ఛీ'కటి దందా - ఫెంటనిల్‌ ఇంజక్షన్ల మాఫియా కేసులో సంచలన విషయాలు

'పది' పాస్‌ కాలేదు కానీ.. పదేళ్ల నుంచి ‘డాక్టర్‌’గా..!

Last Updated : Nov 17, 2024, 11:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.