సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసును డ్రగ్స్ కోణంలో దర్యాప్తు చేస్తున్న మాదకద్రవ్యాల నియంత్రణ మండలి (ఎన్‌సీబీ)ముందు శుక్రవారం నటి రకుల్‌ప్రీత్ సింగ్ హాజరుకానుంది. ఆ తర్వాత శనివారం బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొణె, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్ ఎన్‌సీబీ విచారణకు వెళ్లాల్సి ఉంది. ఈ మేరకు ఎన్‌సీబీ వర్గాలు ధ్రువీకరించాయి. రకుల్‌కు సమన్లు జారీ చేశామని.. ఆమె అందుకుందని, విచారణకు సహకరిస్తానని తెలిపారని అధికారులు చెప్పారు.
శుక్రవారం రకుల్‌తో పాటు.. దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాశ్‌నూ అధికారులు ప్రశ్నించనున్నారు. ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుపుకొంటున్న దీపిక.. విచారణ కోసం భర్త రణ్‌వీర్‌తో కలిసి ముంబయి చేరుకున్నారు. ఆమె ఇంటి దగ్గర ఇప్పటికే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సారా అలీఖాన్ కూడా గురువారం ముంబయి చేరుకుంది. రకుల్, దీపికతో పాటు సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్లకూ ఎన్‌సీబీ సమన్లు జారీ చేసింది. కేసులో చాలా మంది అగ్రనటుల పేర్లు బయటికి వచ్చినట్లు తెలుస్తోంది. కానీ, ఈ విషయంపై అధికారులు ధ్రువీకరించడం లేదు.
-
#UPDATE Yes, Rakul Preet Singh has acknowledged the summons and updated her latest address: Narcotics Control Bureau (NCB) official https://t.co/VlNqUgrNHR
— ANI (@ANI) September 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#UPDATE Yes, Rakul Preet Singh has acknowledged the summons and updated her latest address: Narcotics Control Bureau (NCB) official https://t.co/VlNqUgrNHR
— ANI (@ANI) September 24, 2020#UPDATE Yes, Rakul Preet Singh has acknowledged the summons and updated her latest address: Narcotics Control Bureau (NCB) official https://t.co/VlNqUgrNHR
— ANI (@ANI) September 24, 2020
ఎన్‌సీబీ కాదు.. సీబీఐ విచారించాలి
సుశాంత్ కేసులో అరెస్టై ప్రస్తుతం జైలులో ఉన్న నటి రియా చక్రవర్తి.. మాదకద్రవ్యాల కేసును ఎన్‌సీబీ కాకుండా సీబీఐ దర్యాప్తు చేయాలని కోరింది. ఎన్‌సీబీకి దర్యాప్తు చేసే అధికారం లేదని బాంబే హైకోర్టులో గురువారం ఆమె తరఫున లాయర్ వాదించారు. ఈ కేసులో రియా చక్రవర్తితో పాటు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి కూడా అరెస్టు అయ్యారు. వీరి బెయిల్ పిటిషన్‌పై బాంబే హైకోర్టు ఎలాంటి ఉత్తర్వు జారీ చేయలేదు. కేసును ఈ నెల 28కి వాయిదా వేసింది. మరోవైపు షోవిక్ చక్రవర్తిని ప్రశ్నించేందుకు ఎన్‌సీబీకి కోర్టు అనుమతిచ్చింది.
సంజయ్ రౌత్‌కు నోటీసులు
బృహన్ ముంబయి కార్పొరేషన్(బీఎంసీ) తన బంగ్లాను అక్రమంగా కూల్చివేసిందంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వేసిన పిటిషన్‌కు సమాధానం చెప్పాలని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్‌ను బాంబే హైకోర్టు గురువారం ఆదేశించింది. కంగన.. తన పిటిషన్‌లో తనను సంజయ్ బెదిరించారని పేర్కొన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు రౌత్‌కు నోటీసులు జారీ చేసింది. బంగ్లా కూల్చివేతపై సోమవారంలోగా సమాధానం చెప్పాలని బీఎంసీని కోర్టు ఆదేశించింది. రనౌత్..ఈ నెల 9న వేసిన పిటిషన్‌లో.. బంగ్లాను కూల్చడం అక్రమమని పేర్కొంటూ తీర్పివ్వాలని కోర్టును కోరారు. తర్వాత మార్పులు చేసి బీఎంసీ నుంచి రూ.2 కోట్లు పరిహారంగా ఇప్పించాలంటూ విన్నవించారు.