చిన్న సినిమాలతో కెరీర్ మొదలుపెట్టిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్.. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్లో పలు సినిమాలు చేస్తూ బిజీగా మారింది. సినీ కెరీర్ ఇబ్బందుల గురించి రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చింది.
"అవకాశాలు రాకపోతే భయంతో బతికే మనిషిని కాదు నేను. ఎలాంటి అవకాశాలు లేని స్థితి నుంచి వచ్చిన నేను.. ఎన్నో మంచి సినిమాల్లో నటించాను. నా కలల్ని నిజం చేసుకుని, అనుకున్నది సాధించాను" అని రకుల్ తన కెరీర్ గురించి చెప్పింది.
![Rakul Preet opens up about struggles in her career](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11763145_rakul-2.jpg)
మెగాహీరో వైష్ణవ్తేజ్తో ఈమె నటించిన 'కొండపొలం' విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో గ్రామీణయువతిగా రకుల్ కనిపించనుంది. క్రిష్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం కొవిడ్ ప్రభావంతో థియేటర్లు మూసివేయడం వల్ల ఓటీటీలో ఈ చిత్రాన్ని తీసుకురావాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.