రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'అన్నాత్తె' . శివ దర్శకుడు. గత డిసెంబరులో రజనీకాంత్ అస్వస్థతకు గురవడం వల్ల షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. నాలుగు నెలల అనంతరం రజనీకాంత్ ఈ చిత్ర షూటింగ్ కోసం చెన్నై నుంచి హైదరాబాద్ చేరుకున్నారు.
గత నెలలో చెన్నై శివార్లలో ఈ సినిమా ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇందులో జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. కళానిధి సమర్పణలో సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో నయనతార కథానాయిక. కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ, ప్రకాష్ రాజ్, జాకీ ష్రాఫ్, రోబో శంకర్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. డి.ఇమ్మాన్ సంగీత స్వరాలు అందిస్తున్నారు. వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రాఫర్. ఎడిటర్‌గా రూబెన్ వ్యవహరిస్తున్నారు.
నవంబర్ 4న దీపావళి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇటీవల రజనీకాంత్‌కి 2020కుగానూ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును భారత ప్రభుత్వం ప్రకటించింది.
ఇదీ చూడండి: ఈ అవార్డు వారికి అంకితమిస్తున్నా: రజనీ