ETV Bharat / sitara

ఫ్యాన్స్​లో జోష్​.. రజనీ-ధనుశ్​ కాంబో మూవీ! - rajnikanth latest news

తమిళ స్టార్​ హీరోలు రజనీకాంత్​, ధనుశ్(Rajinikanth-Dhanush)​ కలిసి ఒకే చిత్రం కోసం పనిచేయనున్నట్లు కోలీవుడ్​ వర్గాల సమాచారం. నెట్టిజన్లు దీని గురించే తెగ మాట్లాడుకుంటున్నారు. ఆ సినిమా వివరాలేంటో చూద్దాం..

rajnikanth
రజనీకాంత్​
author img

By

Published : Jul 11, 2021, 4:54 PM IST

తమిళ అభిమానుల్లో జోష్​ నింపే వార్త ఒకటి నెట్టింట్లో వైరల్​గా మారింది. స్టార్​ హీరోలు రజనీకాంత్​-ధనుశ్(Rajinikanth-Dhanush)​ కలిసి ఒకే సినిమా కోసం పనిచేయనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్​ వర్గాలు.

ధనుశ్​ నటనే కాదు 'పా పాండీ' చిత్రంతో దర్శకత్వం చేయగలరని గతంలోనే నిరూపించుకన్నారు. ప్రస్తుతం పలు హిట్​చిత్రాల్లో నటిస్తూ కెరీర్​లో దూసుకెళ్తున్న ఈ మాస్​హీరో తన మామ రజనీకాంత్​ 170వ సినిమా కోసం రంగంలోకి దిగబోతున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించబోతున్నట్లు సినీవర్గాల సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా జరిగాయట!. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రజనీ కూతుర్లు ఐశ్వర్య, సౌందర్య దీనిని నిర్మిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ఇదే కనుక నిజమైతే అభిమానులకు పండగనే చెప్పాలి. ఇప్పటికే ఈ వార్త బయటకొచ్చినప్పటి నుంచి నెటిజన్లు హర్షం చేస్తున్నారు.

ప్రస్తుతం రజనీ.. శివ దర్శకత్వంలో చిత్రం 'అన్నాత్తె' (Rajini Annaatthe) సినిమాలో నటిస్తున్నారు. దీని తర్వాత 169వ సినిమా డైరెక్టర్​ పెరియసామితో చేయనున్నట్లు తెలిసింది. ఆ తర్వాతే అల్లుడు ధనుశ్​ దర్శకత్వంలో నటించనున్నారు.

ఇటీవల ధనుష్​.. 'జగమేతంత్రం' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రస్తుతం 'ది గ్రే మ్యాన్​'(హాలీవుడ్​), యువ దర్శకుడు కార్తిక్​ నరేన్​తో ఓ సినిమా చేస్తున్నారు. తెలుగు దర్శకుడు శేఖర్​ కమ్ములతో ఓ పాన్​ ఇండియా సినిమా చేసేందుకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చారు.

ఇదీ చూడండి: స్టార్ హీరో డ్రీమ్ హౌస్​ కోసం రూ.150 కోట్లు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.