బాలీవుడ్లో విభిన్న కథానాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు రాజ్‌కుమార్ రావ్. ఈ హీరో కంగనా రనౌత్‌తో కలిసి నటించిన 'జడ్జిమెంటల్ హై క్యా' చిత్రం జులై 26న విడుదలకానుంది. కథాంశం బావుందని, అందుకే తాను ఎంత బాగా నటించప్పటికీ... పూర్తి క్రెడిట్ కథకే వెళ్తుందంటున్నాడు. ప్రయోగాలు చేసి విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించడానికి ఇష్టపడతానన్నాడు.
2018లో 'స్త్రీ'తో కడుపుబ్బా నవ్వించిన రాజ్‌కుమార్.. ఈ ఏడాది 'ఏక్ లడ్కి కో దేఖా తో ఐసా లగా' తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
'మేడ్ ఇన్ చైనా', 'తుర్రామ్ ఖాన్' 'రూహి అఫ్జా' వంటి చిత్రాలతో ఈ ఏడాది అలరించనున్నాడు. 'మేడ్ ఇన్ చైనా'లో ఓ గుజరాతీ వ్యాపార వేత్తగా కనిపించనున్నాడు. హీరోయిన్గా మౌనీరాయ్ నటిస్తోంది.
'తుర్రామ్ ఖాన్' చిత్రానికి హన్సల్ మెహతా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ఓ చిన్న పట్టణం నేపథ్యంలో సాగనుంది.
'స్త్రీ 2' గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని.. నిర్మాత దినేష్ ఈ సినిమాకి సన్నాహాలు చేస్తున్నాడని రాజ్‌కుమార్ వెల్లడించాడు.
ఏక్తా కపూర్‌తో రాజ్ కుమార్‌కు "జడ్జిమెంటల్ హై క్యా" మూడవ చిత్రం. ఏక్తా బ్యానర్లో పనిచేయడం ఎప్పడూ సంతోషంగానే ఉంటుందని తెలిపాడు. ఇంతకుముందు ఈ బ్యానర్ లో 'రాగిణి ఎంఎంఎస్', 'ఎల్.ఎస్.డి' సినిమాలు చేశాడు రాజ్‌కుమార్.
ఇది సంగతి: 'బుమ్రా ఎవరో నాకు తెలియదు'