సూపర్‌స్టార్ రజనీకాంత్.. ఆదిత్య అరుణాచలం అనే పోలీస్ అధికారిగా నటిస్తున్న చిత్రం 'దర్బార్'. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇప్పుడు తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ను.. 'తలైవా' రెండు రోజుల్లో పూర్తి చేశాడు. ఈ విషయాన్ని దర్శకుడు మురుగదాస్ ట్వీట్ చేశాడు. తన జీవితంలో మర్చిపోలేని డబ్బింగ్ సెషన్ ఇదంటూ చెప్పాడు.
![Rajinikanth wraps up the dubbing for Darbar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5105059_darbar-dubbing-2.jpg)
ముంబయి మాఫియా నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. నయనతార హీరోయిన్. ఇటీవలే మోషన్ పోస్టర్ విడుదలైంది. త్వరలో టీజర్‌ను తీసుకురానున్నారు. అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. లైకా మూవీ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఇది చదవండి: 'రజనీకాంత్ కాలితో తన్నితే అభిమానులు ఊరుకుంటారా?'