దిగ్గజ సినీ నటుడు, తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్.. ప్రఖ్యాత దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నారు. 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. రజనీకి ఫాల్కే అవార్డును అందజేశారు.
-
Superstar @rajinikanth receives India's highest film honour #DadasahebPhalkeAward at 67th National Film Awards for his outstanding contribution to the world of Indian Cinema 🎥#NationalFilmAwards2019 pic.twitter.com/TdgmuHbzzZ
— PIB India (@PIB_India) October 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Superstar @rajinikanth receives India's highest film honour #DadasahebPhalkeAward at 67th National Film Awards for his outstanding contribution to the world of Indian Cinema 🎥#NationalFilmAwards2019 pic.twitter.com/TdgmuHbzzZ
— PIB India (@PIB_India) October 25, 2021Superstar @rajinikanth receives India's highest film honour #DadasahebPhalkeAward at 67th National Film Awards for his outstanding contribution to the world of Indian Cinema 🎥#NationalFilmAwards2019 pic.twitter.com/TdgmuHbzzZ
— PIB India (@PIB_India) October 25, 2021
రజనీకాంత్‌ను 2019 ఏడాదికిగానూ ఈ అవార్డుకు ఎంపిక చేసింది కేంద్రం. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ మార్చిలోనే ప్రకటించారు. నటుడిగా, నిర్మాతగా, స్క్రీన్‌ప్లే రచయితగా సినీరంగానికి రజనీకాంత్ చేసిన విశిష్ఠ సేవలకుగానూ ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
గత నాలుగు దశాబ్దాలుగా సినీ పరిశ్రమకు రజనీకాంత్ చేస్తున్న సేవలు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. ఆయనను ఈ పురస్కారంతో గౌరవించింది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయనకు అవార్డును అందజేశారు. ఒకే ఏడాదిలో రజనీకాంత్, ఆయన అల్లుడు ధనుశ్.. అవార్డులు అందుకోవడం పట్ల సూపర్‌స్టార్ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
ఇది చదవండి: అట్టహాసంగా జాతీయ అవార్డులు ప్రదానం