ETV Bharat / sitara

Rajinikanth: రిటైర్మెంట్​పై రజనీ మనసులోని మాట! - రజనీకాంత్​ అన్నాత్తే రిలీజ్​

తమిళ సూపర్​స్టార్​ రజనీకాంత్(Rajinikanth)​ త్వరలోనే సినిమాలకు గుడ్​బై(Rajinikanth retirement) చెప్పనున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు ఆయన ఇటీవలే పలుమార్లు అనారోగ్యానికి గురికావడం వల్ల ఆ వార్తకు మరింత బలం చేకూరుతోంది. ఈ నేపథ్యంలో సినిమా భవిష్యత్​పై రజనీకాంత్​.. తన మనసులోని మాట బయటపెట్టారు.

Rajinikanth reveals his retirement
Rajinikanth: రిటైర్మెంట్​పై రజనీకాంత్​ మనసులోని మాట!
author img

By

Published : May 27, 2021, 7:25 PM IST

Updated : May 27, 2021, 10:50 PM IST

ఏడు పదుల వయసులోనూ తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth) ఏమాత్రం ఉత్సాహం తగ్గకుండా సినిమాల్లో నటిస్తున్నారు. ఐదు దశాబ్దాల క్రితం మొదలైన ఆయన సినీ ప్రయాణంలో 160కి పైగా చిత్రాల్లో నటించి దేశంలోనే అగ్రకథానాయకునిగా ఎదిగారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానం సొంతం చేసుకున్నారాయన.

అయితే రజనీ సినీ ప్రయాణం చరిత్రగా మారనుందా..? సూపర్‌ స్టార్‌ సినిమాలకు వీడ్కోలు(Rajinikanth retirement) పలకబోతున్నారా..? అనే చర్చలు ఈ మధ్య జోరుగా సాగుతున్నాయి. దానికి తోడు ఇటీవల ఆయన పదేపదే అనారోగ్యానికి గురవుతుండటం దీనికి మరింత బలం చేకూరుస్తోంది. అయితే దీనికి సంబంధించి రజనీకాంత్‌ స్పందించారు. తన సినిమా భవిష్యత్​పై ఒక హింట్‌ ఇచ్చారు.

ప్రస్తుతం రజనీకాంత్‌ హీరోగా శివ దర్శకత్వంలో 'అన్నాత్తె'(annaatthe shooting) తెరకెక్కుతోంది. హైదరాబాద్‌లో జరుగుతోన్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. ఈ సందర్భంగా రజనీకాంత్‌ తన చిత్రబృందంతో కలిసి కాసేపు సరదాగా ముచ్చటించారట. తనకు మరికొన్నాళ్లు సినిమాల్లో నటించాలని ఉందని, కానీ ఆరోగ్యం సహకరిస్తుందో లేదో చూడాలని తన మనసులోని మాట బయట పెట్టారట. కరోనా తగ్గి, పరిస్థితులు చక్కపడితే ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారని తెలుస్తోంది.

'అన్నాత్తె' చిత్రంలో కీర్తి సురేశ్‌, నయనతార, మీనా, కుష్భూ, ప్రకాశ్‌రాజ్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.

ఇదీ చూడండి: రామోజీ ఫిల్మ్​సిటీలో రజనీకాంత్ యాక్షన్

Last Updated : May 27, 2021, 10:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.