కోలీవుడ్ స్టార్ హీరో సూర్య-దర్శకుడు టి.ఎస్.జ్ఞానవేల్ కలయికలో తెరకెక్కుతున్న సినిమా 'జైభీమ్'(surya jai bhim movie). నవంబరు 2న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది(surya jai bhim movie release date). ఈ సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్(jaibhim trailer)ను విడుదల చేసింది చిత్రబృందం. ఏ తప్పు చేయని బలహీన వర్గ మహిళను కేసు నుంచి బయటపడేసే లాయర్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు సూర్య. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ మూవీని నిర్మిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
శివ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'అన్నాత్తే'(rajinikanth new movie). తెలుగులో 'పెద్దన్న'గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ తెలుగు మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. శనివారం సాయంత్రం 5 గంటలకు టీజర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా.. ఇమ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అక్షయ్ కుమార్ హీరోగా అభిషేక్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలీవుడ్ చిత్రం 'రామ్‌సేతు'(ram setu movie poster). జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్గా చేస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు సత్యదేవ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఊటీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది చిత్రబృందం. ఇందులో అక్షయ్, సత్యదేవ్, జాక్వెలిన్ కనిపిస్తున్నారు.