రజనీ కోసం 'అన్నాత్తె' సెట్‌లో వైద్యులు! - రజనీకాంత్ కోసం డాక్టర్లు
అనారోగ్యం నుంచి ఇటీవలే కోలుకున్న సూపర్‌స్టార్ రజనీకాంత్.. తిరిగి చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో రజనీ కోసం 'అన్నాత్తె' షూటింగ్ సెట్లో వైద్యులను అందుబాటులో ఉంచుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికార ప్రకటన రాలేదు.
సూపర్‌స్టార్ రజనీకాంత్ గతేడాది అనారోగ్యానికి గురవ్వడం వల్ల 'అన్నాత్తె' చిత్రీకరణ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఆ సినిమా షూటింగ్ గురించి కొన్ని వార్తలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. షూటింగ్ సందర్భంగా గత డిసెంబర్‌లో రజనీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రిలో చేర్పించగా.. ఆయనకు రక్తపోటులో హెచ్చుతగ్గులు వచ్చాయని తేలింది. ఈక్రమంలో ఆయనకు చికిత్స చేసిన వైద్యులు రజనీకాంత్‌కు కొన్ని నెలల పాటు విశ్రాంతి అవసరమని సూచించారు.
అనారోగ్యం నుంచి ఇటీవలే కోలుకోగా.. ప్రస్తుతం ఆయన చెన్నైలో జరుగుతోన్న 'అన్నాత్తె' షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఆయనతో పాటే వైద్యులు కూడా సినిమా సెట్లోనే అందుబాటులో ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. దీనికి సంబంధించి చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఈ సినిమా సిరుతయి శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ప్రకాశ్‌రాజ్, సురేశ్, ఖుష్బూ సుందర్, మీన, నయనతార, కీర్తి సురేశ్ కూడా కీలకపాత్రలు పోషించనున్నారు. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో జగపతిబాబు ఒక కీలకపాత్రలో కనిపించనున్నట్లు చిత్రబృందం ఇటీవల ప్రకటించించింది. ఈ సినిమాను నవంబర్ 4న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఇదీ చూడండి: 'హాలీవుడ్ స్థాయిలో రూపొందిన చిత్రం 'మోసగాళ్ళు''