ETV Bharat / sitara

సాయికుమార్​పై సుమన్​కు ఎందుకు కోపం?

author img

By

Published : Dec 8, 2020, 11:12 AM IST

సీనియర్​ నటులు సుమన్​-రాజ్​శేఖర్​కు సాయికుమార్ తెలుగు డబ్బింగ్​ చెప్పేవారు. అయితే వీరిద్దరు వాయిస్​ ఓవర్​​ విషయంలో సాయిని తిట్టేవారని చాలా కాలం నుంచి సాగుతున్న ప్రచారమిది. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన సుమన్​ ఈ విషయంపై స్పందించారు. తానెప్పుడు సాయిని తిట్టలేదని స్పష్టం చేశారు.

suman
సుమన్​

చిత్రసీమలో సీనియర్​ నటులు భానుచందర్​-సుమన్​ మంచి మిత్రులు. తాజాగా 'ఈటీవీ'లో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' టాక్​ షోకు హాజరైన వీరిద్దరు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. స్నేహం విషయంలో బాపు-రమణల్లాగే తమ బంధం కూడా గట్టిదని అన్నారు భానుచందర్‌. కాగా, తనకు డబ్బింగ్​ చెప్పే విషయంలో సాయికుమార్​తో గొడవ జరిగిందని సాగిన ప్రచారంపై స్పందించారు సుమన్. అందులో నిజం లేదని ఆ విషయాన్ని కొట్టిపారేశారు.

'సాయికుమార్​ మీకు డబ్బింగ్​ చెప్పేవారు. అలాగే రాజశేఖర్​కు చెప్పేవారు. అయితే రాజశేఖర్​కు చెబితే మీరు తిట్టేవారట. మీకు చెబితే ఆయన తిట్టేవారట. ఇది నిజమేనా' అని ఆలీ అడగిన ప్రశ్నకు సుమన్​ సమాధానమిచ్చారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'అది నిజం కాదు. రాజశేఖర్​ వచ్చే సరికి నేను తెలుగులో ప్రావీణ్యం సంపాదించా. నిజం చెప్పాలంటే నాకు సాయి అవసరం లేదు. కానీ అంత లైఫ్​ ఇచ్చిన మనిషిని నేను అలా చేయను. నేనెప్పుడు రాజశేఖర్​కు డబ్బింగ్​ చెప్పొద్దని అనలేదు. సరదాగా కూడా చెప్పలేదు. అతడిపై నాకు సరదాగా కోపం ఉండేది. స్టార్​ నటులకు గాత్రం అందించే స్థాయికి వచ్చాక మళ్లీ కింద స్థాయికి వెళ్లొదని సూచించా. అంతేకానీ ఒకరికి చెప్తే మాట్లాడను అని అనలేదు. ఎవరికి వాయిస్​ ఓవర్​​ చెప్పాలి. ఎవరికి చెప్పకూడదు అనేది సాయి ఇష్టం.'

-సుమన్​, సీనియర్​ నటుడు.

ప్రస్తుతం సాయికుమార్​, సుమన్​, భానుచందర్​ పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇదీ చూడండి: విమానంలో సుమ పాట.. కడుపుబ్బా నవ్వాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.