ETV Bharat / sitara

'బాహుబలి-3'పై రాజమౌళి హింట్​ - రాజమౌళి ప్రభాస్​

Rajamouli Bahubali 3: 'బాహుబలి 3' త్వరలోనే రానుందంటూ కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా దీనిపై స్పందించారు దర్శకుడు రాజమౌళి. ఆయన ఏమన్నారంటే..

Bahubali 3 Rajamouli
రాజమౌళి బాహుబలి-3
author img

By

Published : Mar 14, 2022, 11:20 AM IST

Rajamouli Bahubali 3:తెలుగు చిత్రపరిశ్రమ ఖ్యాతిని ప్రపంచదేశాలకు చాటిన చిత్రం 'బాహుబలి'. ప్రభాస్‌, అనుష్క, రానా, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాతో దర్శకధీరుడు రాజమౌళి రికార్డులు సృష్టించాడు. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. కాగా, 'బాహుబలి'కి కొనసాగింపుగా 'బాహుబలి-3' రానుందంటూ గత కొన్నిరోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై ఇటీవల ప్రభాస్‌ స్పందిస్తూ.. "పార్ట్‌-3 గురించి నాక్కూడా తెలియదు. సమయం వచ్చినప్పుడు ఏదైనా జరగొచ్చు" అని చిన్న క్లూ ఇచ్చారు.

ఇక 'ఆర్‌ఆర్‌ఆర్‌' ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జక్కన..'ఇప్పటికే 'బాహుబలి', 'బాహుబలి-2' చూపించారు. మీ నుంచి ‘బాహుబలి-3’ రానుందని భావించవచ్చా?' అని రాజమౌళిని అడగ్గా.. "తప్పకుండా భావించొచ్చు. ‘బాహుబలి’ చుట్టూ జరిగే ఎన్నో సంఘటనలు ఈసారి మీకు చూపించనున్నాం. దీనికి సంబంధించిన వర్క్‌ చేస్తున్నాం. మా నిర్మాత శోభు యార్లగడ్డ కూడా సుముఖంగా ఉన్నారు. దీన్ని చూపించడానికి కాస్త సమయం పట్టొచ్చు. కానీ ‘బాహుబలి’ రాజ్యం నుంచి ఆసక్తికరమైన వార్త రానుంది" అని రాజమౌళి వివరించారు. రాజమౌళి మాటతో సినీ ప్రియులు సంతోషిస్తున్నారు. ‘బాహుబలి-3’ కోసం వెయిటింగ్‌ అంటూ పోస్టులు పెడుతున్నారు.

మహేశ్‌ - రాజమౌళి..

"ముందుగానే చెప్పినట్లు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత నేను చేయబోయే ప్రాజెక్ట్‌ మహేశ్‌బాబుతోనే ఉంటుంది. దానికి సంబంధించి వర్క్‌ జరుగుతోంది. కాకపోతే ప్రస్తుతం నా దృష్టి అంతా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పైనే ఉంది. ఈ సినిమా విడుదలయ్యాక.. కాస్త ప్రశాంతంగా మహేశ్‌ సినిమాపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతా" అని రాజమౌళి తెలిపారు.

ఇదీ చూడండి: హృతిక్​ 'క్రిష్​ 4' సెట్స్​పైకి వెళ్లేది అప్పుడే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.