ETV Bharat / sitara

రికార్డుల రారాజు.. హిట్​ వదలని 'విక్రమార్కుడు' - ఎన్టీఆర్​ ఆర్​ఆర్ఆర్​

Rajamouli RRR movie collections: దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన 'ఆర్​ఆర్​ఆర్'​ మార్చి 25న విడుదల కానుంది. ఈ మూవీ బాక్సాఫీస్​ను బద్దలకొట్టి రూ.3వేల కోట్లు సాధిస్తుందని సినీవిశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో జక్కన్న ఇప్పటివరకు తెరకెక్కించిన సినిమాలు ఏంటి? వాటి నిర్మాణ వ్యయం ఎంత? అవి ఎంత వసూళ్లు సాధించాయి? వంటి విశేషాలను తెలుసుకుందాం....

rajamouli
రాజమౌళి
author img

By

Published : Mar 24, 2022, 4:00 PM IST

Rajamouli RRR movie collections: తెలుగు చిత్రసీమలో అపజయం ఎరుగని దర్శకుడు రాజమౌళి. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా చాటిన దర్శకధీరుడు ఆయన. తన తొలి సినిమా 'స్టూడెంట్​ నెం.1' నుంచి 'బాహుబలి 2' వరకు అన్నీ బాక్సాఫీస్​ వద్ద ఘన విజయాన్ని అందుకున్నవే. అందులో కొన్ని సూపర్​హిట్​, మరికొన్ని బ్లాక్​బాస్టర్స్​, ఇంకొన్ని ఇండస్ట్రీహిట్స్​. 'బాహుబలి'తో ప్రపంచం మొత్తం మన చిత్ర పరిశ్రమ గురించే మాట్లాడుకునేలా చేసిన ఘనత జక్కన్నది. ప్రేక్షకులను ఎలాంటి చిత్రాన్ని అందించాలి? ఏ సినిమాకు ఎంత బడ్జెట్​ పెట్టాలి? వసూళ్ల ఏ మాత్రం అందుకుంటాయి? అని అంచనా వేయడంలోనూ ఆయన దిట్ట అనే చెప్పుకోవాలి. తాజాగా ఎన్టీఆర్​, రామ్​చరణ్​తో ఆయన తెరకెక్కించిన భారీ బడ్జెట్​ మూవీ 'ఆర్​ఆర్​ఆర్​'. దాదాపు రూ.500కోట్ల బడ్జెట్​తో రూపొందించారు. ఇప్పుడు అందరీ కళ్లు ఈ సినిమాపైనే. ఈ సినిమా ఎంత వసూళ్లు సాధిస్తుంది? బాక్సాఫీస్​ వద్ద రికార్డులు సృష్టిస్తుందా? 'బాహుబలి' కలెక్షన్లను అధిగమిస్తుందా? వంటి విషయాలు సినీప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన సినిమాలు ఏంటి? అవి ఎంత బడ్జెట్​తో రూపొందాయి? ఎంత కలెక్షన్లను అందుకున్నాయో తెలుసుకుందాం?

rajamouli
ఆర్​ఆర్​ఆర్​

ఎన్టీఆర్​ హీరోగా తెరకెక్కిన 'స్డూడెంట్​ నెం.1' సినిమా ద్వారా రాజమౌళి దర్శకుడిగా పరిచయమయ్యారు. 2001లో వచ్చిన ఈ మూవీ నిర్మాణ వ్యయం రూ.1.80కోట్లు. ఇది బాక్సాఫీస్​ వద్ద రూ.12కోట్ల గ్రాస్​ను అందుకుంది. జక్కన్న తన రెండో సినిమాను కూడా తారక్​తోనే చేశారు. మాస్​ ఎంటర్​టైనర్​గా రూపొందిన 'సింహాద్రి' చిత్రం 2003లో విడుదలై సూపర్​హిట్​గా నిలిచింది. రూ.8కోట్లతో రూపొందిన ఈ మూవీ రూ.25-40 కోట్ల గ్రాస్​ను కలెక్ట్​ చేసింది.

rajamouli
స్డూడెంట్​ నెం.1

2004లో నితిన్​ హీరోగా వచ్చిన 'సై' రూ.8కోట్లతో తెరకెక్కగా రూ.13కోట్లను సాధించింది. 2005లో విడుదలైన ప్రభాస్​ 'ఛత్రపతి' రూ.8కోట్ల బడ్జెట్​తో ప్రేక్షకుల ముందుకు రాగా రూ.24కోట్లను వసూలు చేసి డార్లింగ్​ కెరీర్​లో బిగ్గెస్ట్​ హిట్​గా నిలిచింది. 2006లో రవితేజ 'విక్రమార్కుడు' రూ.11కోట్లతో రూపొందగా రూ.25కోట్లు వసూలు చేసింది. 2007లో మళ్లీ ఎన్టీఆర్​తో నిర్మించిన 'యమదొంగ' రూ.6కోట్లతో తెరకెక్కగా రూ.28కోట్లను సాధించింది. ఇక 2009లో 'మగధీర' ఇండస్ట్రీ హిట్​గా నిలిచింది. చరణ్​ను స్టార్​హీరోగా నిలబెట్టింది. ఈ మూవీకి అప్పట్లో రికార్డు స్థాయిలో రూ.35కోట్లు ఖర్చు చేయగా రూ.73కోట్లు సాధించి బాక్సాఫీస్​ వద్ద రికార్డులు సృష్టించింది.

rajamouli
ఈగ

ఆ తర్వాత 'మర్యాదరామన్న'కు రూ.12కోట్లు పెట్టగా రూ.30కోట్లు సాధించింది. 2012లో ప్రయోగాత్మకంగా వచ్చిన 'ఈగ' మూవీ రూ.26కోట్లతో రూపొంది రూ.55కోట్లను అందుకుంది. 2015లో వచ్చిన 'బాహుబలి 1' దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రూ.180కోట్లు బడ్జెట్​తో రూపొందిన ఈ మూవీ రూ.ఏకంగా 600కోట్లను సాధించి రికార్డు సృష్టించింది. 2017లో 'బాహుబలి 2'ను రూ.250కోట్లతో తెరకెక్కించగా రూ.1706 కోట్లను సాధించి చరిత్రకెక్కింది. ఇది మన జక్కన్న ట్రాక్ రికార్డు. అయితే ఈ సారి ఏకంగా కుంబస్థలాన్నే బద్దలకొట్టడానికి 'ఆర్​ఆర్​ఆర్'​తో రానున్నారు రాజమౌళి. ఈ మూవీ రూ.3వేల కోట్లు సాధిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎంత వసూళ్లు సాధిస్తుందో చూడాలి.

rajamouli
బాహుబలి

ఇదీ చూడండి: ఆ ఫార్మాట్‌లో తొలి భారతీయ చిత్రంగా 'ఆర్‌ఆర్‌ఆర్‌'.. ఈ విశేషాలు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.