తెలుగు సినీపరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో సినీ ప్రముఖులు ఆదివారం భేటీ అయ్యారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సినీ ప్రతినిధుల సమావేశానికి నిర్మాతలు నట్టి కుమార్, సి.కల్యాణ్, ప్రసన్న కుమార్ సహా దర్శకుడు రాజమౌళి, తమ్మారెడ్డి భరద్వాజ హాజరయ్యారు.
వీరితో పాటు సినిమా 24 క్రాఫ్ట్స్ ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. చిత్ర పరిశ్రమ, కార్మికుల సంక్షేమంపైనే ప్రధానంగా చర్చించనున్నారు.
వరుస సినిమా విడుదలలు, ఏపీలో సినిమా టికెట్ ధరల వ్యవహారం నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.