దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చివరిగా ‘నమో వెంకటేశ’ చిత్రంతో పలకరించి అప్పుడే రెండేళ్లు పూర్తి కావొస్తోంది. త్వరలోనే ఓ సినిమాను పట్టాలెక్కించబోతున్నట్లు వెల్లడించారు ఆయన. మే 28న నటసార్వభౌమ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ సరికొత్త ప్రాజెక్టు విశేషాలు అభిమానులతో పంచుకున్నారు. ఇందులో ముగ్గురు దర్శకులు భాగం కానున్నారని వెల్లడించారు రాఘవేంద్రరావు. ముగ్గురు హీరోయిన్లతో ఓ హీరో మాత్రమే నటిస్తున్నట్లు పేర్కొంటూ జోహార్ ఎన్టీఆర్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్లో పోస్టు చేశారు.
" నా యాభై ఏళ్ల సినీ జీవితంలో అన్నగారితో ప్రయాణం ఎన్నటికీ మరువలేనిది. గత జన్మ సుకృతంగా భావిస్తాను. ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా నా తదుపరి చిత్రాన్ని ప్రకటించడం ఆనందంగా ఉంది. నా కెరీర్లో ఈ చిత్రం ప్రత్యేకం. మరింత కొత్తగా ప్రయత్నించబోతున్నాను. పూర్తి వివరాలు త్వరలో..."
-- రాఘవేంద్రరావు, దర్శకుడు
ఈ సినిమా పూర్తిగా నూతన నటీనటులతోనే తెరకెక్కించాలని యోచిస్తున్నట్లు సమాచారం.