ETV Bharat / sitara

హృతిక్​ సినిమాలో న్యాయవాదిగా స్టార్​ హీరోయిన్​! - హృతిక్​ రోషన్​

హృతిక్​ రోషన్​, సైఫ్​ అలీఖాన్​ ప్రధానపాత్రల్లో తమిళ బ్లాక్​బస్టర్​ 'విక్రమ్​ వేదా' హిందీ రీమేక్(Vikram Vedha Remake)​ కానుంది. ఇందులో ఓ కీలకపాత్ర కోసం ప్రముఖ బాలీవుడ్​ హీరోయిన్​ను సంప్రదించినట్లు సమాచారం. ఆమె ఓ న్యాయవాది పాత్ర పోషించనుందని ప్రచారం జరుగుతోంది.

Radhika Apte to play a lawyer in Hindi remake of Vikram Vedha
Vikram Vedha Remake: న్యాయవాదిగా స్టార్​ హీరోయిన్​!
author img

By

Published : Jul 15, 2021, 8:46 AM IST

Updated : Jul 15, 2021, 11:50 AM IST

బాలీవుడ్​లో భారీ అంచనాలతో తెరకెక్కనున్న రీమేక్​ చిత్రం 'విక్రమ్​ వేద'. హృతిక్​రోషన్​(Hrithik Roshan), సైఫ్​ ఆలీఖాన్(Saif Ali Khan) ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఇందులోని మరో ముఖ్యమైన పాత్ర కోసం కథానాయిక రాధికా ఆప్టేను(Radhika Apte) ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇందులోని న్యాయవాది పాత్ర చాలా కీలకమైంది.

పోలీస్​ అధికారికి (సైఫ్​ అలీఖాన్​) భార్యగా.. గ్యాంగ్​స్టర్​(హృతిక్​ రోషన్​)కు న్యాయవాదిగా వ్యవహరించే ఈ పాత్రకు రాధిక అయితే బాగుంటుందని చిత్రబృందం భావించిదట. తమిళ మాతృకను తెరకెక్కించిన పుష్కర్​, గాయత్రిలే(Pushkar–Gayathri) హిందీ రీమేక్​కు దర్శకత్వం వహించనున్నారు. వచ్చే రెండు నెలల్లో ఈ సినిమాను సెట్స్​పైకి తీసుకెళ్లి 2022 సెప్టెంబరులో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

'విక్రమ్ వేదా' హిందీ రీమేక్​ను తొలుత సైఫ్-ఆమీర్​లతో తెరకెక్కించాలనుకున్నారు. కానీ కొన్ని కారణాలతో ఆమీర్​ ఖాన్​(Aamir Khan) తప్పుకోగా, ఆయన స్థానంలో హృతిక్​ను వేదా పాత్ర పోషించేందుకు తీసుకునట్టు వార్తలు వచ్చాయి. అయితే డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల హృతిక్ కూడా తప్పుకున్నట్టు ఊహాగానాలు జోరందుకున్నాయి. కానీ ఎట్టకేలకు హృతిక్, సైఫ్ కాంబినేషన్​లోనే చిత్రం తెరకెక్కబోతుంది.

ఇదీ చూడండి.. బ్లాక్​బస్టర్​ రీమేక్​లో హృతిక్-సైఫ్

Last Updated : Jul 15, 2021, 11:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.