సల్మాన్‌ఖాన్, దిశాపటానీ జంటగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'రాధే'. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ సినిమా నుంచి 'సీటీమార్' వీడియో సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. తాజాగా మరో పాటను రిలీజ్ చేశారు. 'దిల్ దే దియా' అంటూ సాగే ఐటమ్ సాంగ్ ఆకట్టుకుంటోంది. ఇందులో సల్మాన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ స్టెప్పులు అలరిస్తున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కరోనా కారణంగా ఈ చిత్రాన్ని థియేటర్లతో పాటు నేరుగా ఓటీటీలోనూ విడుదల చేయనున్నారు. పే పర్ వ్యూ పద్ధతిలో ప్రముఖ ఓటీటీ సంస్థ జీ ఫ్లెక్స్‌లో ఈ మూవీని చూడాలంటే రూ.249తో కొనుగోలు చేయాల్సి ఉంటుంది.