ETV Bharat / sitara

Radheshyam: రాధేశ్యామ్​ మూవీ ట్విట్టర్​ రివ్యూ.. ఎలా ఉందంటే? - ప్రభాస్​

Radheshyam twitter review: పాన్​ఇండియా స్టార్ ప్రభాస్​ నటించిన చిత్రం 'రాధేశ్యామ్​' ప్రపంచవ్యాప్తంగా నేడు పెద్దఎత్తున విడుదలవుతోంది. ఇప్పటికే విదేశాలు సహా పలు చోట్ల ఈ సనిమా ప్రివ్యూ షోలను ప్రదర్శించారు. మరి ట్విట్టర్​లో ప్రేక్షకుల రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం..

prabhas radheshyam
radheshyam review
author img

By

Published : Mar 11, 2022, 7:28 AM IST

Updated : Mar 11, 2022, 8:04 AM IST

Radheshyam twitter review: బాహుబలి, సాహో సినిమాలతో పాన్ ఇండియా స్టార్​గా మారిన ప్రభాస్.. రాధేశ్యామ్​ సినిమాతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తొలిసారి హస్త సాముద్రుకిడిగా విక్రమాదిత్య పాత్ర పోషిస్తున్నారు. భారీ బడ్జెట్​తో తెరెక్కిన ఈ సినిమా అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. అయితే ఇప్పిటికే ఈ సినిమాకు సంబంధించి ప్రివ్యూ షోలు అమెరికా సహా పలు నరగరాల్లో ప్రదర్శితమయ్యాయి. ఈ చిత్రం చూసిన అభిమానులు సోషల్​మీడియాలో తమ అభిప్రాయలు చెబుతున్నారు.

ఈ మూవీలో ప్రభాస్​ లుక్​ ఆకట్టుకునే విధంగా ఉందని, విక్రమాదిత్య పాత్రకు బాగా సెట్టయ్యారని నెటిజన్లు చెప్తున్నారు. అయితే సినిమాలో నటనకు పెద్దగా స్కోప్​ లేదని అంటున్నారు. హీరోయిన్​ పూజా హెగ్డేను అందంగా చూపించారని చెబుతున్నారు.

ఇటలో 1970నాటి కాలాన్ని అద్భుతంగా రీక్రియేట్ చేశారని నెటిజన్లు చెబుతున్నారు. విజువల్​గా ఈ సినిమా బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే ఇంకా ఆసక్తికరంగా ఉండి ఉంటే బాగుండేదని, డైలాగ్స్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సి ఉందని అంటున్నారు. సినిమా మాత్రం విజువల్ వండర్​ అని ప్రభాస్ అభిమానులకు నచ్చుతుందని ట్వీట్లు చేస్తున్నారు.

ఇవీ చూడండి:

ప్రపంచ సినీ చరిత్రలో తొలిసారి.. 'రాధేశ్యామ్​' కోసమే అలా!

'రాధేశ్యామ్'​తో ప్రభాస్​ మరోసారి లవర్​బాయ్​గా మెప్పిస్తారా?

Radheshyam: 'ప్రభాస్​ నన్ను చాలా ప్రోత్సహించారు'

Last Updated : Mar 11, 2022, 8:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.