Radheshyam OTT Release date: ప్రభాస్, పూజాహెగ్డే హీరో-హీరోయిన్లు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందనలు అందుకుంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అమెజాన్ సరికొత్త ట్రైలర్‌ను విడుదల చేసింది. ‘రాధేశ్యామ్’లో ప్రభాస్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హస్తసాముద్రికా నిపుణుడి పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తెరపై ప్రభాస్-పూజా హెగ్డేల కెమెస్ట్రీ, పాటలు, విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.
కథేంటంటే: విక్రమాదిత్య (ప్రభాస్) పేరు మోసిన జ్యోతిషుడు. ఇటలీలో నివసిస్తుంటాడు. హస్త సాముద్రికంలో ఆయన అంచనాలు వందశాతం నిజమవుతుంటాయి.తన చేతిలో ప్రేమ రేఖ లేదని తెలుసుకున్న ఆయన తన జీవితం గురించి కూడా ఓ స్పష్టమైన అంచనాతో ఉంటాడు. అనుకోకుండా ప్రేరణని(పూజాహెగ్డే) కలుస్తాడు విక్రమాదిత్య. తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు. కానీ, ప్రేమించలేని పరిస్థితి. మరి విధి ఆ ఇద్దరినీ ఎలా కలిపింది? వాళ్ల జీవితాల్లో జరిగిన సంఘర్షణ ఎలాంటిదనేది మిగతా కథ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: 'ఆర్ఆర్ఆర్' ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.500కోట్ల క్లబ్లో..