ETV Bharat / sitara

'రాధేశ్యామ్' పాట​కు 5 కోట్ల​ వ్యూస్.. 'సిరివెన్నెల' సాంగ్​కు టైం​ ఫిక్స్

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో రాధేశ్యామ్, శ్యామ్​సింగరాయ్, విక్రమ్ వేదా హిందీ రీమేక్, డిటెక్టివ్ 2 చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

radheshyam
'రాధేశ్యామ్' పాట​కు 50 మిలియన్​ వ్యూస్.. 'సిరివెన్నెల' సాంగ్​కు టైమ్​ ఫిక్స్
author img

By

Published : Dec 6, 2021, 9:58 PM IST

Radhe Shyam Song Update: 'రాధేశ్యామ్' గీతం.. అన్ని భాషల్లో కలిపి 50 మిలియన్ వ్యూస్ సాధించింది. తెలుగులో 'నగుమోము తారలే', హిందీలో 'ఆషికీ ఆగయి' అంటూ సాగుతున్న ఈ గీతం.. సంగీత ప్రియుల్ని తెగ అలరిస్తోంది.

ఈ సినిమాలో ప్రభాస్- పూజా హెగ్డే జంటగా నటించారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించగా, రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.

ఇటీవల మరణించిన ప్రముఖ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన చివరి గీతం.. మంగళవారం విడుదల కానుంది. 'శ్యామ్​సింగరాయ్' సినిమాలోని ఈ గీతం.. 'సిరివెన్నెల' అనే లిరిక్స్​తోనే ఉండటం మరో విశేషం.

ssr
శ్యామ్​సింగరాయ్​ అప్డేట్

వినూత్న కథాంశంతో తెరకెక్కిస్తున్న 'శ్యామ్​సింగరాయ్' సినిమాలో నేచురల్ స్టార్ నాని ద్విపాత్రాభినయం చేశారు. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరయిన్లు. మిక్కీ జే మేయర్ సంగీతమందించగా.. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వం వహించారు. డిసెంబరు 24న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

'విక్రమ్ వేదా' హిందీ రీమేక్​లో నటిస్తున్న హృతిక్ రోషన్.. అబుదాబీలోని తన తొలి షెడ్యూల్​ పూర్తి చేశారు. మరో ప్రధాన పాత్రలో నటిస్తున్న సైఫ్ అలీఖాన్.. లఖ్​నవూలో ప్రారంభమయ్యే కొత్త షెడ్యూల్​లో పాల్గొంటారు.

radhe shyam song update
'విక్రమ్​వేదా' రీమేక్​ షూటింగ్​లో హృతిక్​ రోషన్

తమిళ బ్లాక్​బస్టర్ హిట్ 'విక్రమ్ వేదా'కు ఇది రీమేక్​. ఒరిజినల్​కు దర్శకత్వం వహించిన పుష్కర్-గాయత్రి.. ఈ సినిమాకు డైరెక్షన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబరు 30న ఈ చిత్రం విడుదల కానుంది.

విశాల్ 'తుప్పరివాలన్ 2' (డిటెక్టివ్ సీక్వెల్​) సినిమా గురించి అప్డేట్ వచ్చింది. వచ్చే ఏడాది జనవరి నుంచి లండన్​లో రెక్కీ ఉంటుందని, ఏప్రిల్​ నుంచి షూటింగ్​ ప్రారంభం కానుందని విశాల్ ట్వీట్ చేశారు.

తొలి భాగాన్ని రూపొందించిన మిస్కిన్.. ఈ సినిమాకూ దర్శకత్వం వహించాల్సింది. కానీ బడ్జెట్​లో తలెత్తిన వివాదం కారణంగా ప్రాజెక్టు నుంచి ఆయన తప్పుకున్నారు. విశాల్.. ప్రధానపాత్రలో నటించడం సహా దర్శకత్వం నిర్మించడం చేయనున్నారు. డైరెక్టర్​గా విశాల్​కు ఇదే తొలి సినిమా కావడం విశేషం.

ఇదీ చూడండి : సదా సదా.. ఇంత అందంగా ఉంటే ఎలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.