ETV Bharat / sitara

'రాధేశ్యామ్​'లో ప్రధాన ఆకర్షణ సన్నివేశాలు అవే..' - రాధేశ్యామ్ తాజా వార్తలు

Radhe shyam release date: ప్రభాస్ 'రాధేశ్యామ్' చిత్రానికి పనిచేయడం గొప్ప అనుభవాన్ని ఇచ్చిందని ఆ చిత్ర యాక్షన్ డైరెక్టర్ నిక్ పౌల్ తెలిపారు. రామోజీ ఫిల్మ్ సిటీలో 25 రోజులపాటు క్లైమాక్స్, బల్గేరియాలో నీటి అడుగుభాగంలో చిత్రీకరించిన సన్నివేశాలు రాధేశ్యామ్​కు ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతున్నాయని అన్నారు.

Radhe shyam release date
రాధేశ్యామ్
author img

By

Published : Mar 1, 2022, 11:02 PM IST

Radhe shyam release date: 'రాధేశ్యామ్'​ విడుదలకు అంతా సిద్ధమైంది. మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రమోషన్లనూ వేగవంతం చేసింది చిత్రబృందం. ఇందులో భాగంగానే మరో ట్రైలర్​ను విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్రబృందం. మార్చి 2న మధ్యాహ్నం 3గంటలకు రెండో ప్రచార చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో ఈ చిత్ర యాక్షన్ డైరెక్టర్ నిక్ పౌల్, దర్శకుడు రాధాకృష్ణ ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నారు.

'రాధేశ్యామ్' చిత్రానికి పనిచేయడం గొప్ప అనుభవాన్ని ఇచ్చిందని ఆ చిత్ర యాక్షన్ డైరెక్టర్ నిక్ పౌల్ తెలిపారు. క్లైమాక్స్, బల్గేరియాలో నీటి అడుగుభాగంలో చిత్రీకరించిన సన్నివేశాలు ఈ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయన్నారు. సెట్స్, వీఎఫ్ఎక్స్ పనులు ఎక్కువగా ఉన్నప్పటికీ ముందస్తుగా సిద్ధం కావడం వల్ల రాధేశ్యామ్​ను అనుకున్న స్థాయిలోనే పూర్తి చేసినట్లు నిక్ పౌల్ వెల్లడించారు.

ప్రమాదకర సన్నివేశాల్లో ప్రభాస్ ఎంతో తేలిగ్గా నటించారని, ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ రాధేశ్యామ్ లోని కీలక సన్నివేశాలను తెరకెక్కించినట్లు నిక్ పౌల్ పేర్కొన్నారు.

రొమాంటిక్ లవ్​స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకధీరుడు రాజమౌళి వాయిస్​ ఇచ్చారు. ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్​గా నటించింది. కృష్ణంరాజు కీలకపాత్ర పోషించారు. జస్టిన్ ప్రభాకరన్ పాటలు స్వరపరచగా, తమన్ బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్ అందించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్- గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.

'రాధేశ్యామ్​' ప్రధాన ఆకర్షణ సన్నివేశాలు అవే.

ఇదీ చూడండి: 'సాయిపల్లవి కంటే రష్మిక అందానికే జోహార్లు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.