ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక నిర్మాణవ్యయంతో నిర్మించిన చిత్రంగా 2011లో విడుదలైన 'పైరేట్స్ ఆఫ్ ద కరీబియన్'-ఆన్‌స్ట్రేంజర్ టైడ్స్ నిలిచింది. ఈ చిత్ర నిర్మాణానికి ఏకంగా 378.5 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.2,630 కోట్లు) వ్యయమైంది. బాక్సాఫీస్ వద్ద కూడా అంతకు మించిన ఘనమైన విజయం సొంతం చేసుకుంది ఆన్‌స్ట్రేంజర్ టైడ్స్. ప్రపంచ వ్యాప్తంగా 1.046 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.7,217 కోట్లు) వసూలు చేసి సంచలనం సృష్టించింది.
ఖర్చు 8వేల కోట్లు.. వసూళ్లు 31వేల కోట్లు
'పైరేట్స్...' పేరుతో వచ్చిన అయిదు సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తొలి సినిమా 2003లో వచ్చిన 'పైరెట్స్ ఆప్ ద కరీబియన్: ద కర్స్ ఆఫ్ ద బ్లాక్ పెర్ల్ 'తో మొదలైంది. వాల్ట్‌డిస్నీ సంస్థ అందించిన ఈ సినిమాల్లో రెండోది 'డెడ్‌మ్యాన్స్ చెస్ట్' (2006), మూడోది 'ఎట్ వరల్డ్స్ ఎండ్' (2007),నాలుగో సినిమా ' ఆన్‌స్ట్రేంజర్ టైడ్స్'(2011), అయిదో సినిమా 'డెడ్‌మెన్ టెల్ నో టేల్స్' (2017). వీటన్నింటి ఉమ్మడి బడ్జెట్ 1.274 బిలియన్ డాలర్లు(దాదాపు రూ. 8,814 కోట్లు). ఇవన్నీ కలిసి సాధించిన వసూళ్లు 4.56 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.31,646 కోట్లు). వీటన్నింటినీ ‘స్వాష్‌బక్లర్’ సినిమాలంటారు. అంటే కత్తి యుద్ధాలు, చారిత్రక కథలు, సాహసాలతో ఉంటాయి. అమెరికా రచయిత టిమ్ పవర్స్ 1987లో రాసిన హిస్టారికల్ ఫాంటసీ నవల ఆధారంగా ఈ సినిమాలను తెరకెక్కించారు. ప్రస్తుతం వీటికి కొనసాగింపుగా ఆరో సినిమా రెడీ అవుతోంది.
ఇవీ చూడండి.. 'మంచి కథలు వస్తే 24 గంటలు పని చేస్తా'