ETV Bharat / sitara

కిక్​ బాక్సింగ్​తో బిజీ.. కారణం చెప్పిన రాశీ - మూవీ న్యూస్

కిక్ బాక్సింగ్ ప్రాక్టీసుతో బిజీగా ఉన్న నటి రాశీఖన్నా.. అది నేర్చుకోవడానికి గల కారణాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఈమె ఓ వెబ్​సిరీస్, పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

Raashi Khanna takes up kickboxing for this special reason
కిక్​ బాక్సింగ్​తో బిజీ.. కారణం చెప్పిన రాశీ
author img

By

Published : Feb 28, 2021, 8:02 PM IST

'ఊహలు గుసగుసలాడే'తో హీరోయిన్​గా​ పరిచయమైన రాశీఖన్నా.. అందులో బొద్దుగా, ముద్దుగా కనిపించి.. అభిమానుల గుండెల్ని మెలిపెట్టేసింది. ఆ తర్వాత తన శరీరాకృతి విషయంలో చాలా శ్రద్ధ పెట్టి నాజుగ్గా తయారైంది. ఇప్పుడు ప్రత్యేకంగా కిక్ బాక్సింగ్ నేర్చుకుంటోంది. దీని వల్ల తాను మరింత పవర్​ఫుల్​గా తయారవుతున్నానని తెలిపింది.

"నాలోని రెబల్ కోణాన్ని కిక్ బాక్సింగ్​ బయటకు తీస్తోంది. దీని వల్ల మరింత పవర్​ఫుల్​గా తయారవుతున్నాను. ఎలాంటి ఛాలెంజ్​ను అయినా ఎదుర్కోగలనని అనిపిస్తోంది. ఓ యాక్టర్​గా ఫ్రస్టేషన్​ను ఎవరిపై చూపించలేం. అలాంటప్పుడు జిమ్​కు వెళ్లి కిక్​ బాక్సింగ్​ చేస్తుంటే రిలాక్సింగ్​గా అనిపిస్తుంది. నేను చేస్తున్న తొలి వెబ్​ సిరీస్​ ప్రిపరేషన్​కూ ఇది ఉపయోగపడుతోంది" అని రాశీఖన్నా చెప్పింది.

ప్రస్తుతం ఈ వెబ్​ సిరీస్​ చేస్తున్న రాఖీఖన్నా.. తమిళంలో 'తుగ్లక్ దర్బార్', మలయాళ 'అంధాధున్' రీమేక్​తో బిజీగా ఉంది.

raashi khanna shahid kapoor
షాహిద్​ కపూర్​తో రాశీఖన్నా
vijay sethupathi raashi khanna
తుగ్లక్ దర్బార్ షూటింగ్​లో విజయ్ సేతుపతితో రాశీఖన్నా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.