ప్రముఖ నటుడు మాధవన్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని స్పష్టం చేశారు. ప్రతిఒక్కరూ కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
![madhavan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11153037_as-2.jpg)
90ల్లో వచ్చిన మణిరత్నం 'అలైపాయతే'(తెలుగులో 'సఖి') సినిమాతో మాధవన్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటించి పేరు సంపాదించారు.
2018లో వచ్చిన 'బ్రీత్' వెబ్ సిరీస్‌తో డిజిటల్ తెరంగేట్రం చేశారు. ఇటీవల 'మారా'తో ప్రేక్షకుల్ని పలకరించారు. దుల్కర్ సల్మాన్ 'చార్లీ' సినిమాకు రీమేక్‌గా దీనిని తెరకెక్కించారు. ప్రస్తుతం తొలిసారి దర్శకుడిగా 'రాకెట్రీ' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రముఖ శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు.
ఇదీ చూడండి: నటుడు మాధవన్‌ను వరించిన డాక్టరేట్