చిత్రసీమలో లవర్‌బాయ్‌గా అందరినీ ఆకట్టుకున్న నటుడు మాధవన్.. కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత, రచయిత, గాయకుడిగానూ ప్రేక్షకాదరణ పొందారు. సినీ పరిశ్రమలో ఆయన అందించిన సేవలకు గుర్తుగా మహారాష్ట్ర కోల్హాపుర్లోని డీవై పాటిల్ యూనివర్సిటీ ఆయన్ను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ఈ పురస్కారం తనకు అందించడంపై మాధవన్ హర్షం వ్యక్తం చేశారు.
![madhavan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10664847_zxc.jpg)
1970 జూన్ 1న పుట్టిన ఆయన అసలు పేరు మాధవన్ బాలాజీ రంగనాథన్. మాధవన్ హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, ఆంగ్లం, మలై వంటి పలు భాషాచిత్రాల్లో నటించారు. తొలిసారిగా బాలీవుడ్‌లో 'ఇస్ రాత్ కీ సుభా నాహిన్' చిత్రంలో ఓ పాట పాడారు. తర్వాత 'ఇన్‌ఫెర్నో' అనే ఆంగ్ల సినిమాలో నటించారు. కన్నడలో 'శాంతి శాంతి శాంతి'లో హీరోగా చేశారు. పరిశ్రమకు కొత్తగా వచ్చిన వెంటనే మూడు భాషల్లో అవకాశాలను అందుకున్న ఏకైక నటుడు మాధవన్ మాత్రమే. హిందీలో '3 ఇడియట్స్'తో ఫిల్మ్‌ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు. 'తనూ వెడ్స్ మనూ'తో మంచి విజయాన్ని అందుకున్నారు.
హిందీ, తమిళంలో ఆయన నటించిన చాలా చిత్రాలు మంచి పేరు తెచ్చాయి. ఆయన నటించిన సినిమాలు తెలుగులోకీ డబ్బింగయ్యాయి. అందులో 'చెలి', 'సఖి'తో రొమాంటిక్ హీరోగా అభిమానులకు గుర్తుండిపోయారు. ఇటీవల అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'నిశ్శబ్దం' చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్' సినిమాలో నటిస్తున్నారు.
ఇదీ చూడండి: ఆ విషయంలో అదృష్టవంతుడిని: మాధవన్