యువ కథానాయకుడు అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. పూజా హెగ్డే హీరోయిన్. బ్యాచ్‌లర్ క్వారంటైన్ లుక్ అంటూ ఇప్పుడు కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో అఖిల్ ల్యాప్‌టాప్ పట్టుకుని సోఫాలో కూర్చుని పనిచేసుకుంటుంటే పూజా, తన కాలి మునివేళ్లతో అఖిల్‌ను రొమాంటిక్‌గా ఆటపట్టిస్తున్నట్లుంది.
గీతా ఆర్ట్స్ 2 పతాకంపై తీస్తున్న ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. బన్నీ వాసు నిర్మాత. గోపీసుందర్ సంగీతమందిస్తున్నారు. 2021 జనవరిలో చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది.