'పుష్ప' ట్రైలర్ తెగ సందడి చేస్తుంది. దీనికి మరికాస్త ఊపు తెచ్చేలా కొత్త అప్డేట్ వచ్చింది. సమంత చేసిన స్పెషల్ సాంగ్ 'ఓ అంటావా ఓ ఓ అంటావా..' అంటూ సాగే ఈ గీతం డిసెంబరు 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు.
"ఈ చలికాలంలో సమంత తన డ్యాన్స్‌తో హీట్ పెంచడానికి వస్తుంది" అని ట్వీట్ చేశారు. ఈ ఫొటోలో హాట్‌గా కనిపిస్తున్న సామ్.. సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అనే ఆత్రుతను అభిమానుల్లో పెంచేస్తోంది.
అయితే ఈ సినిమా రిలీజ్‌కు దగ్గర పడుతున్న సమయంలో బన్నీ మంచి మనసు చాటుకున్నారు. డైరక్షన్ డిపార్ట్మెంట్లో ఒక్కొక్కరికి ఖరీదైన బంగారు కాయిన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలానే మిగతా టీమ్‌కు డబ్బులు బహుమతిగా అందిచారట.
సోమవారం రాత్రి విడుదలైన 'పుష్ప' ట్రైలర్.. ఊరమాస్‌గా ఉంటూ అంచనాల్ని అమాంతం పెంచేస్తోంది. అల్లు అర్జున్, రష్మిక, సునీల్, ఫహాద్ ఫాజిల్, అనసూయ తమ ప్రెజెన్స్‌తో మెప్పిస్తున్నారు.
శేషాచలం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో తీసిన ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి పార్ట్.. ఈ డిసెంబరు 17న పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి.
ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందించగా, సుకుమార్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: