ఫహాద్ ఫాజిల్ ప్రధానపాత్రలో నటించిన మలయాళ చిత్రం 'మాలిక్'. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్ ద్వారా జులై 15న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ మూవీకి మహేశ్ నారయణన్ దర్శకత్వం వహించగా.. ఆంటో జోసఫ్ నిర్మాతగా వ్యవహరించారు.

'ద్వైత్వ'గా పవర్‌స్టార్
'కేజీఎఫ్' చిత్రంతో బ్లాక్బాస్టర్ను ఖాతాలో వేసుకున్న హోంబళే నిర్మాణ సంస్థ.. ఇప్పుడు ప్రభాస్‌తో 'సలార్' సినిమాను తెరకెక్కిస్తోంది. ఈ బ్యానర్లో మరో కొత్త చిత్రం కూడా రూపొందనుంది. కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హీరోగా పవన్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా షూటింగ్ జరుపుకొంటోంది. దీనికి సంబంధించిన టైటిల్‌ను చిత్రబృందం గురువారం ప్రకటించింది. ఈ చిత్రానికి 'ద్వైత్వ' టైటిల్‌ను ఖరారు చేశారు. పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. విజయ్ కిరగండూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబరులో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.

తేజా సజ్జా 'అద్భుతం'..
యువ కథానాయకుడు తేజా సజ్జా, శివాని రాజశేఖర్ జంటగా ఓ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకు 'అద్భుతం' టైటిల్‌ను ఖరారు చేశారు. దీనికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తుండగా.. చంద్రశేఖర్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.

ఇదీ చూడండి.. 'గని'గా మారిన వరుణ్‌తేజ్.. 'డాక్టర్' ఓటీటీ రిలీజ్