'నాటు నాటు' (Naatu Naatu Song).. ప్రస్తుతం ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్న పాట. టాలీవుడ్‌లో డ్యాన్సింగ్ స్టార్స్‌గా చెప్పుకొనే రామ్‌చరణ్- తారక్ మాస్ స్టెప్పులతో ఈ పాట సోషల్ మీడియాను ఓ ఊపు ఊపుతోంది. ఇప్పుడు, ఇదే పాటకు కన్నడ దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar) స్టెప్పులేస్తే ఎలా ఉంటుందో తెలియజేస్తూ ఇటీవల ఓ నెటిజన్ వీడియో క్రియేట్ చేశాడు. పునీత్ నటించిన సినిమాల్లోని స్టెప్పులన్నింటినీ కలిపి.. 'నాటు నాటు' సాంగ్ వీడియో సృష్టించాడు. '#Puneeth lives On' అని పేర్కొంటూ నెట్టింట్లో ఆ వీడియోను (Puneeth Rajkumar Dance) షేర్ చేయగా ప్రస్తుతం వైరల్‌గా మారింది.
-
#ಹಳ್ಳಿನಾಟು ft PowerStar⚡@PuneethRajkumar❤️#PuneethRajkumar #KingAPPU pic.twitter.com/lOHjtOtagV
— Pramod⚡ (@_PramodAppu1) November 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">#ಹಳ್ಳಿನಾಟು ft PowerStar⚡@PuneethRajkumar❤️#PuneethRajkumar #KingAPPU pic.twitter.com/lOHjtOtagV
— Pramod⚡ (@_PramodAppu1) November 21, 2021#ಹಳ್ಳಿನಾಟು ft PowerStar⚡@PuneethRajkumar❤️#PuneethRajkumar #KingAPPU pic.twitter.com/lOHjtOtagV
— Pramod⚡ (@_PramodAppu1) November 21, 2021
ఈ వీడియో చూసిన అభిమానులు.. "పునీత్ డ్యాన్స్ అదుర్స్" అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇటీవల గుండెపోటుతో కన్నుమూశారు పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar Death). ఈ క్రమంలో ఆయన్ని గుర్తు చేసుకుంటూ పలువురు అభిమానులు మధుర జ్ఞాపకాలను వీడియోలుగా షేర్ చేస్తున్నారు.
రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన 'ఆర్‌ఆర్‌ఆర్'లో రామ్‌చరణ్-తారక్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో తారక్ (NTR) కొమురం భీమ్‌గా.. చరణ్ (RamCharan) అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరీస్ కథానాయికలు. జనవరి 7న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో చిత్రబృందం ప్రమోషన్స్ షురూ చేసింది. ఈ క్రమంలోనే ఇప్పటికే రెండు పాటలను విడుదల చేసింది. మూడో పాట విడుదలకు సిద్ధమైంది. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇవీ చూడండి:
Puneeth Biopic: త్వరలోనే పునీత్ రాజ్‌కుమార్ బయోపిక్!