Puneeth Rajkumar James movie prerelease event: కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నటించిన 'జేమ్స్' చిత్రం మార్చి 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఆయన నటించిన చివరి సినిమా కారణంగా దీనిపై ఫ్యాన్స్‌లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తోంది చిత్రబృందం.
ఈ కార్యక్రమాన్ని మార్చి 6న ఘనంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని తెలిసింది. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశముంది. కాగా, ఈ సినిమాకు చేతన్ కుమార్ దర్శకత్వం వహించగా.. ప్రియా అనంద్ హీరోయిన్గా నటించారు.
తారక్-పునీత్ మధ్య మంచి స్నేహం ఉంది. గతంలో పునీత్ సినిమా కోసం ఎన్టీఆర్ తన గాత్రాన్ని అందించారు. 'చక్రవ్యూహ' మూవీలో 'గెలయా గెలయా' అనే పాటను పాడారు. ఇక మెగాస్టార్ చిరంజీవి.. పునీత్ కుటుంబం మధ్య కూడా మొదటి నుంచి సన్నిహిత సంబంధాలు బాగానే ఉన్నాయి.
పునీత్.. గతేడాది అక్టోబరు 29న గుండెపోటుతో మరణించారు. ఆయన మరణాన్ని ఇప్పటికీ అభిమానులు, సెలబ్రిటీలు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇదీ చదవండి: షూటింగ్ వీడియో లీక్.. కొత్త లుక్‌లో రామ్‌చరణ్!