మరణానంతరం(puneeth rajkumar eye transplant) తన కళ్ల ద్వారా నలుగురి జీవితాల్లో వెలుగులు నింపాడు కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్. పునీత్ స్ఫూర్తితో నేత్రదానం చేసేందుకు ముందుకొచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నేత్రదానం(eye donation) చేసేవారికి ఆయన ఓ రోల్‌మోడల్‌గా నిలుస్తున్నారు. ఒక్క వారంలోనే కర్ణాటకలో 400 మంది నేత్రదానం చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు.
నేత్రదానం(eye donation) సమాచారం కోసం రోజూ వందల మంది తమ ఆస్పత్రికి ఫోన్లు చేస్తున్నట్లు హూబ్లీలోని ఎం.ఎం. జోషి కంటి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. గతవారం దాదాపు 500 మంది ఫోన్ చేసి సమాచారం తెలుసుకోగా.. ఇప్పటివరకు 400 మంది నేత్రదానం చేసేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు.
పునీత్ మరణానికి ముందు రోజుకు 3-4 ఫోన్ కాల్స్ మాత్రమే వచ్చేవని.. పునీత్ మరణాంతరం ఆ సంఖ్య గణనీయంగా పెరిగిందని ఎం.ఎం. జోషి కంటి ఆస్పత్రి ఎండీ డాక్టర్. శ్రీనివాస్ జోషి తెలిపారు.
ఇదీ చూడండి: పునీత్ నేత్రదానంతో ఆ నలుగురి జీవితాల్లో వెలుగు