ETV Bharat / sitara

పవన్​ బర్త్​డే రోజు అభిమానులకు క్రిష్​ సర్​ప్రైజ్​ - పవన్​ కల్యాణ్​ పుట్టినరోజు

పవన్​ కల్యాణ్​ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన హీరోగా క్రిష్​ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ఫస్ట్​లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా పవన్​తో పదిహేను రోజుల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు దర్శకుడు క్రిష్​.

PSPK27: pawan kalyan- krish movie pre look revealed
పవన్​ బర్త్​డే: అభిమానులకు దర్శకుడు క్రిష్​ సర్​ప్రైజ్​
author img

By

Published : Sep 2, 2020, 1:00 PM IST

పవర్​స్టార్​ పవన్‌కల్యాణ్​ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. పవన్​ పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్​లుక్​ పోస్టర్​ను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో చేతికి కడియం, ఉంగరాలు పెట్టుకుని కొత్త లుక్​తో పోస్టర్​ ఉంది.

  • @PawanKalyan గారు, #PSPK27 పదిహేన్రోజుల షూటింగ్ ప్రతిక్షణం టీం అందరికీ గొప్ప జ్ఞాపకంలా కదులుతుంది..
    చిరస్థాయిగా నిలిచే విజయం కంటికి కనిపిస్తుంది..
    ఇందుకు కారణం మీరు, మీ ప్రోత్సాహం, మీ సహృదయం..
    ఎప్పటికీ ఇలాగే కోట్లాది జనం శుభాకాంక్షలు అందుకుంటుండాలని ఆశిస్తూ #HBDPawanKalyan pic.twitter.com/PCVhIO3uxm

    — Krish Jagarlamudi (@DirKrish) September 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"పవన్​ కల్యాణ్​ గారు.. పదిహేను రోజుల షూటింగ్​లో ప్రతిక్షణం టీమ్​ అందరికి జ్ఞాపకంలా కదులుతోంది. చిరస్థాయిగా నిలిచే విజయం కంటికి కనిపిస్తుంది. ఇందుకు కారణం మీరు, మీ ప్రోత్సాహం, మీ సహృదయం.. ఎప్పటికీ ఇలాగే కోట్లాది జనం శుభాకాంక్షలు అందుకుంటూ ఉండాలని ఆశిస్తూ.. హ్యాపీ బర్త్​డే పవన్​ కల్యాణ్​."

- క్రిష్ జాగర్లమూడి, దర్శకుడు

ఈ చిత్రానికి నిర్మాతగా ఏఎం రత్నం వ్యవహరిస్తుండగా.. ఎమ్​ఎమ్​ కీరవాణి స్వరాలను సమకూరుస్తున్నారు. రచయిత సాయి మాధవ్​ బుర్రా మాటలు అందించనున్నారు. ఇందులో తెలుగమ్మాయి పూజిత పొన్నాడ ప్రత్యేక గీతంలో నటించనుందని సమాచారం. ఈ సినిమాలో పవన్‌ బందిపోటుగా కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.