అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన సినిమా 'హౌస్‌ఫుల్-4'. ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం చేస్తోన్న చిత్రబృందం, కాస్త వినుత్నంగా ఆలోచించింది. కదులుతున్న రైలులో చిత్ర ప్రమోషన్‌ను చేయాలని నిర్ణయించుకుంది. అందుకోసం ముంబయి నుంచి దిల్లీ వరకు ప్రత్యేక ట్రైన్‌ను ఏర్పాటు చేసింది. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో అక్షయ్ కుమార్, రితేశ్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్, పూజా హెగ్డే, కృతి సనన్, కృతి కర్బందా తదితరులు సందడి చేశారు.

ఈ రైలును మొత్తం పోస్టర్లతో నింపేసింది చిత్రబృందం. అందులో ప్రయాణించిన నటీనటులు అందరూ పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ ఆకట్టుకున్నారు.
పునర్జన్మల నేపథ్య కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి ఫరాద్ శాంజీ దర్శకత్వం వహించాడు. సాజిద్ నడియావాలా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అలరిస్తోంది.
ఇది చదవండి: హౌస్‌ఫుల్4: ఓ పాట కోసం 200 మంది డ్యాన్సర్లు