లాక్‌డౌన్ కారణంగా సినిమా విడుదల షెడ్యూల్స్‌లో మార్పులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కోవలోనే 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా విడుదల వాయిదా పడబోతోందని నిర్మాత దానయ్య తెలిపారు. 2021 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని యూనిట్ భావించింది. కానీ, అందులో మార్పులు జరగబోతున్నాయి.
ప్రభుత్వం అనుమతిస్తే..
"సినిమాకు సంబంధించి 70 శాతం షూటింగ్ పూర్తయింది. మిగిలిన 30 శాతం షూట్‌ను రెండు-మూడు నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. కానీ లాక్‌డౌన్ వల్ల అది వాయిదాపడింది. దీని ప్రభావం వీఎఫ్‌ఎక్స్ పనులపై పడే అవకాశం ఉంది. అలా కాకుండా ఉండాలంటే విడుదలలో మార్పులు జరగాల్సిందే. ప్రభుత్వం మాకు అనుమతులు ఇస్తే.. పరిమిత బృందంతో సెట్‌లో షూట్ జరుపుతాం" అని నిర్మాత డీవీవీ దానయ్య ఓ ఆంగ్లపత్రికతో అన్నారు.
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రమిది. అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. చెర్రీకి జంటగా ఆలియా భట్, తారక్‌కు జంటగా ఒలీవియా మోరిస్ సందడి చేయనున్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 'బాహుబలి' తర్వాత జక్కన్న తీస్తున్న సినిమా ఇది కావడం.. ఇందులో తారక్-చెర్రీ నటిస్తుండటం వల్ల భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇదీ చూడండి.. అతనే నా కలల రాకుమారుడు: పూజాహెగ్డే