బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన 'రాక్షసుడు'.. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతోంది. ఈ విజయాన్నిచ్చిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెపుతూ ఆనందం వ్యక్తం చేశారు శ్రీనివాస్ తండ్రి, నిర్మాత బెల్లంకొండ సురేశ్.
"నేను నిర్మాతగా 21 ఏళ్లు పూర్తి చేసుకున్నా. 25 స్ట్రయిట్, 8 డబ్బింగ్ సినిమాలను ప్రేక్షకులకు అందించాను. ఇవేవీ ఆనందాన్ని ఇవ్వలేదు. అయితే 'రాక్షసుడు' సినిమా మా అబ్బాయి సాయి శ్రీనివాస్‌కు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈరోజుల్లో రీమేక్ చేయడం చాలా కష్టం. సినిమాను తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా ఎలాంటి మార్పులు చేయకుండా అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు రమేశ్ వర్మ. అప్పుడు సాంబయ్య సినిమాకు ఎలాగైతే నన్ను ప్రేక్షకులు ఆదరించారో, ఇప్పుడు మా అబ్బాయినీ అలాగే ఆదరిస్తున్నారు. ఇప్పటి నుంచి శ్రీనివాస్ ప్రతి సినిమాకు జర్నలిస్ట్ అసోసియేషన్‌కు రూ.10 లక్షలు ఇవ్వాలని నిర్ణయించుకున్నా." -బెల్లంకొండ సురేశ్, నిర్మాత
రాక్షసుడులో అనుపమ హీరోయిన్గా నటించింది. రమేశ్ వర్మ దర్శకత్వం వహించాడు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అందరినీ అలరిస్తోంది.
ఇది చదవండి: సైకోకిల్లర్ వేటలో... 'అల్లుడు శ్రీను'