జులై 18న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా పుట్టినరోజు సందర్భంగా ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు ఆమె భర్త గాయకుడు నిక్ జోనస్. దీనికి సంబంధించి ఓ ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఇందులో ప్రియాంకను నిక్ ఒడిలో కూర్చొబెట్టుకుని ప్రేమతో ఒకరికళ్లలోకి ఒకరు చూసుకంటూ కనువిందు చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"నాకు ఎప్పటికీ నీ కళ్లలోకి చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఐ లవ్ యూ బేబి. నీ వంటి ఆలోచనాత్మక, శ్రద్ధగల, అద్భుతమైన వ్యక్తిని నా జీవితంలో ఎవ్వరినీ చూడలేదు. నువ్వు నా జీవితంలోకి వచ్చినందుకు చాలా అదృష్టవంతుడ్ని. హ్యాపీ బర్త్ డే బ్యూటిఫుల్" అంటూ నిక్ రాసుకొచ్చాడు.
2018 డిసెంబరులో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ప్రియాంక పుట్టినరోజు సందర్భంగా నిక్‌తో పాటు అనేకమంది సెలిబ్రిటీలూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.