ETV Bharat / sitara

మిస్​ఇండియా వీడియోపై ప్రియాంక చమత్కారం! - priyanka chopra updates

బా లీవుడ్​ ముద్దుగుమ్మ ప్రియాంకా చోప్రా ఇటీవలే సినీ కెరీర్​లో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. తాజాగా 2000 సంవత్సరంలో మిస్​ ఇండియా టైటిల్ గెలుచుకున్నప్పటి వీడియోనూ ఇన్​స్టా వేదికగా షేర్​ చేస్తూ.. పలు విషయాలు పంచుకుంది.

Priyanka Chopra reacts to her Miss India pageant video
ప్రియాంక
author img

By

Published : Jul 24, 2020, 7:11 PM IST

బాలీవుడ్​లో 50కిపైగా సినిమాల్లో నటించి.. విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకున్న నటి ప్రియాంకా చోప్రా. హాలీవుడ్​లో బలమైన ముద్ర వేసిన బాలీవుడ్​​ నటుల్లో ప్రియాంక ఒకరు. 2000 సంవత్సరంలో మిస్​ ఇండియా, మిస్ వరల్డ్​​గా గుర్తింపు పొందిన ఈ నటి.. ఆ తర్వాత తన సినీ కెరీర్​ను ప్రారంభించి ఇంతటి ఘనత సాధించింది.

ఇటీవలే సినీ కెరీర్​లో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. తను మిస్​ ఇండియా గెలుచుకున్నప్పటి వీడియోను గుర్తుచేసుకుంటూ స్పందించింది ప్రియాంక. ఈ క్రమంలోనే ఇన్​స్టాగ్రామ్​లో ఓ వీడియోనూ షేర్​ చేస్తూ.. ఆ సమయంలో తన స్టైల్​, నడిచే విధానంపై సరదాగా చమత్కరిచింది.

"ఏమ్​ పర్వాలేదు.. నేను 2000 సంవత్సరంలో మిస్​ ఇండియా గెలుచుకున్నప్పటి వీడియోను ఇప్పుడు చూస్తున్నా. నా సినీ కెరీర్​ అంతా అక్కడే ప్రారంభమైంది. ఒకవేళ మీరు ఇంతకుముందు వీడియోను చూడకపోతే.. ఇదిగో చూసేయండి."

-ప్రియాంకా చోప్రా, సినీ నటి

ఈ అవార్డు గెలుచుకుంటానని కలలో కూడా ఊహించలేదని ప్రియాంక తెలిపింది. తనకు ఎల్లప్పుడూ తోడుగా నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు చెప్పింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.