బాలీవుడ్లో హీరో అజయ్ దేవ్‌గణ్ నటిస్తున్న చిత్రం 'మైదాన్'. ప్రముఖ ఫుట్‌బాలర్ సయ్యద్ అబ్దుల్ రహీం జీవితం ఆధారంగా తీస్తున్నారు. ఇందులో తొలుత కీర్తి సురేశ్ హీరోయిన్గా ఎంపికైంది. కానీ ఇటీవలే ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ఇప్పుడీ పాత్రలో జాతీయ నటి ప్రియమణి కనిపించనుంది. ఈమె ఈ రోల్‌కు కచ్చితంగా సరిపోతుందని భావించిన చిత్రబృందం ఈ నిర్ణయం తీసుకుందట.
'మైదాన్'కు అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకుడు. జీ స్టూడియోస్, బేవివ్యూ ప్రాజెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ఏడాది నవంబర్ 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రియమణి.. తెలుగులో వెంకటేశ్ సరసన 'అసురన్'లో నటిస్తుందని టాక్. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి'లోనూ జయ సన్నిహితురాలు శశికళగా కనిపించనుంది.