ETV Bharat / sitara

''విరాటపర్వం' కోసం ఎదురు చూస్తున్నా' - virataparvam latest news

రానా, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం 'విరాట పర్వం'. ఈ సినిమాలో ప్రియమణి ఓ కీలకపాత్ర పోషిస్తోంది. తాజాగా ఆ క్యారెక్టర్​ గురించి చెప్పుకొచ్చింది.

ప్రియమణి
ప్రియమణి
author img

By

Published : Apr 24, 2020, 5:13 PM IST

'పెళ్లైన కొత్తలో', 'యమదొంగ', 'రగడ'లాంటి చిత్రాల్లో నటించి అలరించిన నటి ప్రియమణి. ప్రస్తుతం రానా హీరోగా వస్తున్న 'విరాటపర్వం' సినిమాలో ఈ హీరోయిన్ బెల్లి లలిత అనే పాత్రలో కనిపించనుంది. వెంకీ ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కథానాయికగా సాయి పల్లవి నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం గురించి ప్రియమణి మాట్లాడుతూ తన పాత్ర గురించి చెప్పుకొచ్చింది.

"ఇదొక యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న గొప్ప చిత్రం. సినిమా అంతా 1992నాటి నక్సలిజం నేపథ్యంలో ఉంటుంది. నా పాత్ర గురించి అందరికీ చెప్పాలని ఉంది. చాలా తీవ్రమైన పాత్ర అని చెప్పగలను. సినిమా ఎప్పుడు ప్రారంభమౌతుందా అని నేను ఎదురు చూస్తున్నా."

-ప్రియమణి, హీరోయిన్

ఇప్పటికే సినిమా షూటింగ్‌ ప్రారంభమై కొంతభాగం చిత్రీకరణ జరుపుకొంది. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌ వాయిదా పడింది. ఇంకా ఇందులో నందితా దాస్, టబు, జరీనా వహబ్, ఈశ్వరీ రావు తదితరులు నటిస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మితమౌతున్న సినిమాకు దగ్గుబాటి సురేష్, సుధాకర్‌ చెరుకూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.