ETV Bharat / sitara

ప్రియమణి 'భామాకలాపం' ఆకట్టుకుందా?

Bhamakalapam review: నటి ప్రియమణి నటించిన కొత్త సినిమా 'భామాకలాపం' ఓటీటీ వేదికగా ఆహాలో విడుదలైంది. అభిమన్యు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్​ విజయ్​, శాంతి రావు తదితరులు కీలక పాత్ర పోషించారు. మరి ఈ సినిమా ఎలా ఉందంటే?

Priyamanci Bhamakalapam movie Review
ప్రియమణి భామాకలాపం
author img

By

Published : Feb 15, 2022, 3:52 PM IST

Bhamakalapam review: చిత్రం: భామాకలాపం; నటీనటులు: ప్రియమణి, జాన్‌ విజయ్‌, శాంతి రావు, శరణ్య ప్రదీప్‌ తదితరులు; సినిమాటోగ్రఫీ: దీపక్‌; ఎడిటింగ్‌: విప్లవ్‌ నైషిధం; సంగీతం: జస్టిస్‌ ప్రభాకరన్‌, మార్క్‌ కె. రాబిన్‌; రచన: అభిమన్యు, జయ కృష్ణ, అశ్విన్‌; దర్శకత్వం: అభిమన్యు; విడుదల: ఆహా

ఒకప్పుడు సినిమా విడుదల అంటే కేవలం థియేటర్‌లోనే. ఇప్పుడా పరిస్థితి లేదు. నటీనటులు, బడ్జెట్‌ అన్నీ కుదిరితే ఓటీటీలోనూ విడుదల చేసేందుకు అవకాశం ఉంది. కొన్నిసార్లు థియేటర్లు దొరకని పరిస్థితుల్లో చిన్న చిత్రాలు ఓటీటీల వైపు మొగ్గు చూపుతున్నాయి. అలా తాజాగా ‘ఆహా’ ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘భామా కలాపం'. ప్రియమణి నటించిన ఈ సినిమా ఎలా ఉంది? ఈ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది?

కథేంటంటే: అనుపమ మోహన్‌(ప్రియమణి)(Priyamani) గృహిణి. యూట్యూబ్‌లో వంటల ఛానెల్‌ నిర్వహిస్తుంటుంది. ఎప్పటికప్పుడు కొత్త వంటకాలను చేయడంతో పాటు, పక్కింట్లో ఏం జరుగుతుందోనన్న విషయాలను సైతం ఆసక్తిగా గమనిస్తూ ఉంటుంది. మరోవైపు కోల్‌కతా మ్యూజియంలో రూ.200 కోట్ల విలువైన గుడ్డు ఒకటి మాయమవుతుంది. ఆ గుడ్డు వల్ల అనుపమ, ఆమె కుటుంబం ఎలా ఇబ్బందుల్లో పడింది? ఇతరుల విషయాలను తెలుసుకోవాలన్న అనుపమ ఉత్సుకత వల్ల వచ్చిన ముప్పు ఏంటి? చివరకు ఆ ఆపద నుంచి ఎలా బయటపడింది? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: ఒక విలువైన వస్తువు పోవటం లేదా దొంగతనానికి గురవటం. అది చేతులు మారుతూ వెళ్లే క్రమంలో కథానాయకుడు/నాయికలు ఇబ్బందుల్లో పడటం.. దాని నుంచి బయట పడేందుకు వాళ్లు చేసే ప్రయత్నాలు ఇలా థ్రిల్లింగ్‌ అంశాలతో నడిచే కథ, కథానాలు ప్రేక్షకుడిని ఎప్పుడూ అలరిస్తూనే ఉంటాయి. గతంలో ‘స్వామి రారా’ ఇప్పుడు ‘భామా కలాపం’(Bhamakalapam). ఒకవైపు నవ్వులు పంచుతూనే సినిమా చూస్తున్న ప్రేక్షకుడిని కథలో లీనం చేయడంలో ‘భామా కలాపం’ దర్శకుడు అభిమన్యు విజయం సాధించారు. సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికే కథ రూ.200కోట్ల విలువైన గుడ్డు చుట్టూ తిరుగుతుందని దర్శకుడు చెప్పేశాడు. పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగిన అనుపమ చేసే ప్రయత్నాలు, దాని వల్ల ఇతరులు పడే ఇబ్బందులు నవ్వులు పంచుతాయి. క్రిమినల్స్‌ చేతిలో నుంచి పడిపోయిన గుడ్డు కోసం వాళ్లు వెతకడం, అది అటు తిరిగి, ఇటు తిరిగి అనుపమ పక్కింట్లో ఉండే ఫిరోజ్‌ వద్దకు రావటం ఇలా కథనమంతా ఉత్కంఠగా సాగుతుంది. ఫిరోజ్‌ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తితో అక్కడకు వెళ్లిన అనుపమ అనుకోని పరిస్థితుల్ల్లో హత్య చేయాల్సి రావటం, ఆ శవాన్ని మాయం చేసేందుకు ఆమె చేసే ప్రయత్నాలను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. పోలీసుల విచారణ మొదలైన తర్వాత కథనం కాస్త నెమ్మదించినా, తర్వాత ఏం జరుగుతుందన్న ఆసక్తి మాత్రం ప్రేక్షకుడిని వెంటాడుతూనే ఉంటుంది. ద్వితీయార్ధంలో వచ్చే మలుపులు సినిమాపై మరింత ఉత్కంఠ కలిగిస్తాయి. అయితే, చివరికి వచ్చే సరికి సినిమాను చకచకా ముగించేసినట్టు అనిపిస్తుంది. పతాక సన్నివేశాలను ఇంకాస్త ఉత్కంఠగా తీర్చిదిద్ది ఉంటే బాగుండేది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఎవరెలా చేశారంటే: ప్రియమణి(Priyamani) నటించిన తొలి వెబ్‌ ఫిల్మ్‌ ఇది. పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగిన మహిళగా అనుపమ పాత్రలో ప్రియమణి ఒదిగిపోయింది. హత్య చేసిన తర్వాత ఆ శవాన్ని మాయం చేసే క్రమంలో ప్రియమణి హావభావాలు బాగున్నాయి. నాయర్‌గా జాన్‌ విజయ్‌ డిక్షన్‌ బాగుంది. శరణ్య ప్రదీప్‌ నటన నవ్వులు పూయిస్తుంది. మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు నటించారు. దీపక్‌ సినిమాటోగ్రఫీ, విప్లవ్‌ ఎడిటింగ్‌ బాగున్నాయి. పాటలేమీ గుర్తుండిపోయేవి కావు. మార్క్‌ కె. రాబిన్‌ నేపథ్య సంగీతం సినిమాను ఎలివేట్‌ చేసింది. రచయిత, దర్శకుడు అభిమన్యు గుడ్డు చుట్టూ ఓ ఆసక్తికర కథను అల్లుకుని కామెడీ థ్రిల్లర్‌ను తీర్చిదిద్దడంలో విజయం సాధించారు. అయితే, పతాక సన్నివేశాలపై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. కుటుంబమంతా ఓ థ్రిల్లర్‌ సినిమా చూడాలంటే ‘భామా కలాపం’ చూడొచ్చు.

బలాలు

+ కథ, కథనం

+ ప్రియమణి

+ ట్విస్టులు

బలహీనతలు

- పతాక సన్నివేశాలు

చివరిగా: అనుపమ వంట బాగుంది. కానీ, ఇంకాస్త ఉడికించాల్సింది!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ఇదీ చూడండి: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో సందడి చేసే సినిమాలివే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.