సామాజిక మాధ్యమాల్లో ఒకే ఒక్క సన్నివేశంతో సంచలనం సృష్టించిన కేరళ నటి ప్రియా వారియర్. ప్రస్తుతం ప్రియా హిందీలో ‘'లవ్ హ్యాకర్స్' అనే సినిమా చేసేందుకు అంగీకరించిందట. ఈ చిత్రానికి మయాంక్ ప్రకాశ్ శ్రీవాత్సవ దర్శకత్వం వహించనున్నాడు.
సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్ ఆసరాగా కొన్ని నిజజీవిత కథల ఆధారంగా సినిమా తెరకెక్కనుందని సమాచారం. అనుకోకుండా ఓ అమ్మాయి ‘లవ్ హ్యాకర్స్’కు చిక్కడం, ఆ తరువాత ఆ అమ్మాయి ఎదుర్కొన్న సమస్యలు, వాటి నుంచి ఎలా తప్పించుకుంది అనేది కథ.
ప్రియా నటించిన మొదటి బాలీవుడ్ చిత్ర 'శ్రీదేవి బంగ్లా'. ఈ సినిమా వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. మలయాళంలో వచ్చిన వారియర్ తొలి చిత్రం 'ఒరు అదార్ లవ్'’. ఇదే సినిమా తెలుగులో ‘'లవర్స్ డే'’గా విడుదలైంది.
ఇవీ చూడండి.. సామ్ 'మాయ' ఓ మజిలీ...