ETV Bharat / sitara

ప్రభాస్​ 'ఆదిపురుష్'‌ కోసం అన్ని హంగులా? - adipurush

ప్రభాస్​ 'ఆదిపురుష్'​ కోసం హాలీవుడ్​లో 'అవతార్'​ 'స్టార్ వార్స్​' చిత్రాలకు పనిచేసిన వీఎఫ్​ఎక్స్​ బృందాల్ని చిత్రబృందం సంప్రదించిందని టాక్​. కేవలం గ్రాఫిక్స్​ కోసమే దాదాపు రూ.250కోట్లు ఖర్చు పెట్టనున్నారని సమాచారం.

prabjas
ప్రభాస్​
author img

By

Published : Sep 12, 2020, 6:09 AM IST

కథానాయకుడు ప్రభాస్‌ 'బాహుబలి', 'సాహో' చిత్రాలతో తనకు దక్కిన మార్కెట్‌ను.. రానున్న కాలంలో మరింత పెంచుకునే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అందుకు తగ్గట్లుగానే భవిష్యత్‌ ప్రాజెక్టులన్నింటినీ ఒకదాన్ని మించి మరొకటి భారీ స్థాయిలో ఉండేలా చూసుకుంటున్నాడు. ముఖ్యంగా ప్రభాస్‌ 22వ చిత్రం 'ఆదిపురుష్'‌ను హాలీవుడ్‌ స్థాయిలో రూపొందించే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు ఓం రౌత్‌.

రామాయణ నేపథ్యంతో సాగే ఈ కథలో డార్లింగ్‌ రాముడిగా కనిపించనుండగా.. లంకేషుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌ దర్శనమివ్వబోతున్నాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందబోయే ఈ త్రీడీ చిత్రంలో గ్రాఫిక్స్‌కు ఎంతో ప్రాధాన్యముంది. సినిమా చిత్రీకరణ దాదాపుగా బ్లూమ్యాట్‌లో జరగనుంది. అందుకే ఈ గ్రాఫిక్స్‌ వర్క్స్‌ కోసం హాలీవుడ్‌లో 'అవతార్'‌, 'స్టార్‌ వార్స్'‌ వంటి చిత్రాలకు పనిచేసిన విఎఫ్‌ఎక్స్‌ బృందాల్ని సంప్రదిస్తోందట చిత్రబృందం. సినిమాలో దాదాపు 40వేలకు పైగా గ్రాఫిక్ షాట్స్‌ ఉండనున్నాయని బాలీవుడ్‌ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ గ్రాఫిక్స్‌ పనుల కోసమే దాదాపు రూ:250కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు టాక్​.

ఇదీ చూడండి మరో బాలీవుడ్ నటుడికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.