నృత్యదర్శకుడు ప్రభుదేవా రెండోసారి పెళ్లి పీటలు ఎక్కనున్నారా? అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ప్రస్తుతం తన మేనకోడలుతో రిలేషిన్‌షిప్‌లో ఉన్నట్లు, త్వరలోనే వీరిద్దరూ వివాహం జరగనున్నట్లు సమాచారం.
ప్రభు, తన భార్య రామలత మధ్య మనస్పర్థలు తలెత్తడం వల్ల కొనేళ్ల క్రితమే విడిపోయారు. ఆ తర్వాత ఓ హీరోయిన్‌తో ప్రేమాయాణం నడిపినట్లు, పెళ్లి కూడా చేసుకోనున్నట్లు జోరుగా ప్రచారం సాగింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలోనే ప్రభు, తన మేనకోడలిని వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ప్రకటన రావాల్సి ఉంది.
బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ 'రాధే' సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు ప్రభుదేవా. తమిళంలో 'పొన్ మనిక్కావెళ్', 'థీల్', 'యంగ్మంగ్ సంగ్', 'ఊమయ్ విఝిగల్', 'భగీర్' చిత్రాల్లో నటిస్తున్నారు.
ఇదీ చూడండి :