ETV Bharat / sitara

ప్రభాస్​తో ప్రశాంత్​ నీల్.. అధికారిక ప్రకటన, అదిరే టైటిల్ - ప్రభాస్​తో కేజీఎఫ్ దర్శకుడు

డార్లింగ్​ ప్రభాస్​ మరో కొత్త సినిమా ఒప్పుకున్నారు. ప్రశాంత్​ నీల్ దర్శకత్వం వహించబోయే ఈ చిత్రానికి 'సలార్' టైటిల్​ను నిర్ణయించారు.​ 'కేజీఎఫ్' నిర్మాణ సంస్థ హొంబాలే ఫిల్మ్స్​ నిర్మిస్తోంది.

PRABHAS WITH KGF DIRECTOR PRASANTH NEEL.. SALAAR TITLE FIXED
ప్రభాస్​తో ప్రశాంత్​నీల్.. అదిరిపోయే టైటిల్​
author img

By

Published : Dec 2, 2020, 2:19 PM IST

Updated : Dec 2, 2020, 2:39 PM IST

రెబల్​స్టార్ ప్రభాస్​ జోరు చూపిస్తున్నారు. ఇప్పటికే మూడు చిత్రాలు చేస్తున్న ఆయన.. 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్​ నీల్​తోనూ చేయనున్నారు. బుధవారం దీని గురించి అధికారికంగా ప్రకటించడం సహా 'సలార్' టైటిల్​తో కూడిన పోస్టర్​ను విడుదల చేశారు. 'అత్యంత క్రూరమైన వ్యక్తి' అని పోస్టర్​కు క్యాప్షన్​ జోడించారు. వచ్చే జనవరి నుంచి షూటింగ్ ప్రారంభించనున్నారు.

pabhas salaar cinema
ప్రభాస్ 'సలార్' సినిమా పోస్టర్

కోలీవుడ్​ హీరో ఆర్య కొత్త సినిమాకు 'సరపట్ట' టైటిల్​ పెట్టారు. బాక్సర్​ లుక్​లో ఉన్న కథానాయకుడి ఫొటోను విడుదల చేశారు. 'కబాలి', 'కాలా' సినిమాల ఫేమ్​ పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

జయం రవి, హన్సిక, అరవింద్ స్వామి కలిసి నటిస్తున్న 'బోగన్' సినిమా.. తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కొత్త పోస్టర్​ను పంచుకున్నారు. లక్ష్మణ్ దర్శకుడు.

షకలక శంకర్ హీరోగా నటిస్తున్న 'బొమ్మ అదిరింది.. దిమ్మ తిరిగింది' టీజర్​ను హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్​ విడుదల చేసింది. హారర్ కామెడీ కథాంశంతో దీనిని తెరకెక్కించారు. త్వరలో థియేటర్లలో ఈ చిత్రాన్ని రిలీజ్​ చేయనున్నట్లు తెలిపారు.

aryua sarapattu
ఆర్య సరపట్టు సినిమా పోస్టర్
bhoogan poster
బోగన్ పోస్టర్
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Dec 2, 2020, 2:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.